రీ ధరకు భారతీయుడు2 డిజిటల్ రైట్స్

ఒక్క విజయం ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. స్మాల్ హీరో అయినా స్టార్ హీరో అయినా.. అప్ కమింగ్ స్టార్ అయినా వెటరన్ స్టార్ అయినా.. హిట్టే ఇక్కడ కిక్ ఇచ్చే ఏకైక అంశం. చాలా యేళ్లుగా అలాంటి విజయం కోసం ఎదురుచూసిన స్టార్ కమల్ హాసన్.

కమల్ హాసన్ నుంచి బ్లాక్ బస్టర్ అనే మాట విని దశాబ్దం దాటిందంటే అతిశయోక్తి కాదు. ఆ లోటును తీర్చింది విక్రమ్. విక్రమ్ సాధించిన విజయం కమల్ కే కాదు.. కోలీవుడ్ కే బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చింది. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ ఏకంగా 400 కోట్లు కలెక్షన్స్ సాధించింది. మరి ఇంత పెద్ద విజయం తర్వాత మరో సినిమా వస్తోదంటే దాని బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుంది. అదే భారతీయుడు2కు జరిగింది.


ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చే సినిమా బిజినెస్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు భారతీయుడు2 విషయంలో అదే రిపీట్ అయింది. 1996లో వచ్చిన భారతీయుడుకు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీని మళ్లీ శంకరే డైరెక్ట్ చేస్తున్నాడు. అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందీ సినిమా. విశేష ఏంటంటే.. ప్యాన్ ఇండియన్ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇది.

ఆ సినిమాకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కు నిదర్శనంగా భారతీయుడు2 చిత్ర డిజిటల్ రైట్స్ ఏకంగా 200 కోట్లకు అమ్మేశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. యస్.. ఈ మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ 200 కోట్లు చెల్లించి ఈ రైట్స్ ను దక్కించుకుందంటున్నారు. ఇది షారుఖ్ ఖాన్, జవాన్, డంకీ చిత్రాలకంటే చాలా బెటర్ ఫిగర్ అనే చెప్పాలి.

బడ్జెట్ పరంగానూ ఆ చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న సినిమా.అలా చూస్తే డిజిటల్ రైట్స్ తోనే మాగ్జిమం సేఫ్ అయిపోయినట్టే. ఇక ఈ సినిమాలో కమల్ తో పాటు సిద్ధార్థ్, ఎస్.జే.సూర్య, వివేక్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవానీ శంకర్, వెన్నెల కిశోర్, కాళిదాస్ జయరామ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా భారతీయుడు2కు ఇంత క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే వచ్చే సంక్రాంతికి విడుదలవుతుందనుకున్న ఈ చిత్రం 2024 సమ్మర్ కు వాయిదా పడింది. మరి అప్పుడు థియేట్రికల్ రైట్స్ కోసం ఎంత పోటీ ఉంటుందో చూడాలి.

Related Posts