ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ గ్లింప్స్

‘బాహుబలి’ ఫేమ్ రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ‘హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్’. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అటెన్షన్ పెంచిన ‘జితేందర్ రెడ్డి’ నుంచి గ్లింప్స్ రిలీజయ్యింది. గ్లింప్స్ లో జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రె ను చూపించిన విధానం బాగుంది. ‘నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొపాలి’ అనే సుబ్బరాజ్ డైలాగ్ తో గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

Related Posts