పెళ్లాం ఊరెళితే లాంటి క్యారెక్టర్‌ వస్తే మళ్లీ నటిస్తా – ప్రశాంతి హారతి

ప్రశాంతి హారతి.. ఈ మధ్య కాలంలో సినిమాలలో కనిపించకపోయినా తెలుగు ఆడియెన్స్‌కి బాగా సుపరిచితమైన నటి. ఇంద్ర , పెళ్లాం ఊరెళితే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలం ఆటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో సమావేశమై తన అంతరంగాన్ని పంచుకున్నారు.
తమది వైజాగ్ అనీ, సినిమా వాతావరణం లేని కుటుంబంలో పెరిగానన్నారు. చిన్నపుడు కూచిపూడి నేర్చుకోవడం వల్ల ప్రత్యేకించి యాక్టింగ్ కోర్సులు చేయకపోయినా నటనలో హావభావాలు పలికించడం ఈజీ అయ్యిందన్నారు. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఫొటోషూట్స్ చేశాను. ఫొటోస్ చూసి కొన్ని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తామంటూ సంప్రదించారు. మా కుటుంబ సభ్యులు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపేందుకు ఒప్పుకోలేదు. కొంతకాలం తర్వాత హైదరాబాద్ షిప్ట్ అయ్యాం. యాక్టింగ్ పట్ల నా ఇంట్రెస్ట్ చూసి మా ఇంట్లో వాళ్లు ఎట్టకేలకు ఒప్పుకున్నారన్నారు


పెళ్లయ్యాక మా వారితో యూఎస్ వెళ్లాను. అప్పటి నుంచి వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించాను. అక్కడ ఓంకార అనే కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. మన నృత్యరూపకాలు రేపటి తరానికి కూడా అందాలనేది నా కోరిక. ఈ ఆశయంతోనే క్లాసికల్ డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకు కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తూ వచ్చాను. అక్కడి పిల్లలకు తెలుగు తెలియదు. క్లాసికల్ డ్యాన్స్ పాటల్లోని అర్థాలను ఇంగ్లీష్ లో వివరించి చెప్పేవాళ్లం. అప్పుడు వారికి అర్థమై నేర్చుకునేవారు. మా పాప తాన్య నా దగ్గరే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది అని చెప్పారు.


మనకు చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కంటే కథలో కీలకమైన కొన్ని క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. పెళ్లాం ఊరెళితే సినిమాలో నేను చేసిన సునీల్ వైఫ్ క్యారెక్టర్ చూడండి..ఎంతో అమాయకంగా ఉంటుంది. ఇప్పటికీ ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ అంటే ఆ పాత్ర గుర్తొస్తుంది. అలాంటి కథలో కీలకంగా ఉండి ప్రాధాన్యత గల పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఆఫర్స్ లభిస్తే సినిమాలతో పాటు ఓటీటీ వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ లో నటించాలని ఉంది. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నా. నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటే. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఉంటే బెంగళూరు చెన్నై వెళ్లి వస్తుంటా అన్నారు ప్రశాంతి హారతి.

Related Posts