టిల్లు స్క్వేర్ రిలీజ్‌ ట్రైలర్ వస్తుంది

టాలీవుడ్‌ లో మోస్ట్ ఎవెయిటెడ్ ఎంటర్‌టైనర్స్‌ లో ఫస్ట్ లో ఉండే సినిమా టిల్లు స్క్వేర్. డిజె టిల్లు తో సిద్దు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కు తెలుగు ఆడియెన్స్‌ ఫుల్ ఫిదా. ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్‌లో ఇవ్వడానికి సిద్దమైంది టిల్లు స్క్వేర్‌. అనుపమ ఫీమేల్ లీడ్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు మల్లిక్ రామ్‌ డైరెక్టర్‌.
మార్చి 29 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు మరింత పెంచింది చిత్ర యూనిట్‌. ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసింది. ట్రైలర్‌ రిలీజ్ డేట్‌ తో అనౌన్స్ చేసిన పోస్టర్‌ వైరల్ అవుతోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన నేహాశెట్టి.. ఇందులో గెస్ట్ రోల్ చేయనుంది.

Related Posts