ఓ సినిమా తీసినా, చేసినా ఓ మంచి సందేశం ఉంటుందని అనుకోవాలి – కలియుగం పట్టణంలో హీరో విశ్వ కార్తికేయ

కలియుగం పట్టణంలో .. ఈ టైటిల్‌తోనే సినిమా పట్ల క్యూరియాసిటీ క్రియేట్ చేసిన డైరెక్టర్‌ రమాకాంత్ రెడ్డి. డైరెక్షన్‌ తో పాటు కథ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో యంగ్‌స్టర్‌ విశ్వకార్తికేయ హీరో.. కాగా ఆయుషిపటేల్ హీరోయిన్‌. మార్చి 29 న రిలీజ్‌ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్‌. ఈ నేపథ్యంలో హీరో విశ్వకార్తికేయ మీడియా మిత్రులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

  • ప్రతీ మనిషిలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. వాటిని చూపించేలా ఈ చిత్రం ఉంటుంది. నంద్యాలలో ఈ సినిమా కథ జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు ‘కలియుగం పట్టణంలో’ అని పెట్టామన్నారు.* ఎలాంటి పాత్రనైనా చేయగలను అనే పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాను. ఇందులో ప్రతీ పాత్ర చక్కగా ఉంటుంది. అన్ని కారెక్టర్లకు రెండు షేడ్స్ ఉంటాయి. రెండు షేడ్స్ ఉంటాయా? డబుల్ రోలా? అన్నది చెప్పలేం. నాకు మాత్రం ఈ కథ చాలా నచ్చింది. అందుకే ఎంతో ఇష్టంతో ఈ చిత్రాన్ని చేశానన్నారు. కోపంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి.. ఎక్కువగా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఇలా ప్రతీ ఒక్క ఎమోషన్ కోసం వర్క్ షాప్‌ చేశామన్నారు విశ్వ కార్తికేయ. నేను ఇంతకు ముందు చేసిన ‘కళాపోషకులు’ పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. ‘అల్లంత దూరానా’ మెలో డ్రామాగా ఉంటుంది. ‘జై సేన’ అనేది పూర్తి కమర్షియల్‌గా ఉంటుంది. అయితే ఈ చిత్రం మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. థ్రిల్లర్, సస్పెన్స్ మాత్రమే కాకుండా మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందన్నారు.
  • కడపలో చాలా మంచి లొకేషన్లున్నాయి. అంతా లైవ్ లొకేషన్లలోనే షూట్ చేశాం. సెట్ వర్క్ చేయలేదు. మా సినిమాను అన్నపూర్ణ బ్యానర్ రిలీజ్ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. మంచి అవుట్ పుట్ వచ్చింది. మా సినిమాకు మీడియా నుంచి మంచి సపోర్ట్ లభిస్తోందన్నారు. ఆయుషి తెలుగు అమ్మాయి కావడం సినిమాకు కలిసి వచ్చింది. ప్రతీ కారెక్టర్‌కు డిఫరెండ్ షేడ్స్ ఉంటాయి. తన కారెక్టరైజేషన్‌లోనూ మల్టీపుల్ షేడ్స్ ఉంటాయి. తెలుగు అమ్మాయి అయితే పాత్రలోని భావాన్ని సులభంగా అర్థం చేసుకుంటుందని ఆమెను తీసుకున్నామన్నారు. విశ్వ ఓ సినిమా తీసినా, చేసినా ఓ మంచి సందేశం ఉంటుందని అనుకోవాలి. నా సినిమా చూసి చెడుదారిన పట్టకూడదని అనుకుంటాను. ఓ ఇండోనేషియా ప్రాజెక్ట్‌ చేస్తున్నాను. ఆ మూవీలోనూ ఆయుషి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. మంత్ర, తంత్రాలు, చేతబడుల నేపథ్యంలో ఆ సినిమా ఉండబోతోందన్నారు.

Related Posts