వైఎస్ఆర్సీపి తో నాకు సంబంధం లేదు.. జీవిత

రాజకీయ సంబంధమైన సినిమాలొచ్చినప్పుడల్లా వాటికి సెన్సార్ ఇబ్బందులు తప్పవు. ఆయా రాజకీయ నాయకులను కించపరిచే విధంగా ఆ సినిమాలు ఉన్నాయనే పేరుతో సెన్సార్ సభ్యులు ఆ చిత్రాలకు సర్టిఫికెట్ జారీ చేయడానికి నిరాకరిస్తారు. అలాంటి సినిమాలను రివైజింగ్ కమిటీకి పంపిస్తారు. ఇప్పుడు రామ్ గోపాల్మ వర్మ ‘వ్యూహం’ సినిమా విషయంలో అదే జరిగింది.

‘వ్యూహం’ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లడంతో అక్కడ సభ్యురాలిగా ఉన్న జీవిత రాజశేఖర్ ను ఈ సినిమా సెన్సార్ చేయకుండా ఆపాలని నిర్మాత నట్టికుమార్ సెన్సార్ బోర్డుకి లేఖ రాశాడు. ఈ లేఖలో జీవిత వైఎస్ఆర్సీపి లో ఉందని.. అందుకే ‘వ్యూహం’ సినిమాకి సెన్సార్ వచ్చేలా చేయడంలో ఆమె ప్రోత్సాహం ఉంటుందని తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు నట్టికుమార్.

అయితే.. ఈ విషయాన్ని జీవిత ఖండించింది. తాను ఇప్పుడు వైఎస్ఆర్సీపి లో లేనని.. బి.జె.పి. పార్టీలో ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం మీడియాలో సర్కులేట్ అవుతోన్న ఫోటోలు చాలా సంవత్సరాల క్రితం నాటివని తెలియజేసింది. మరోవైపు ‘వ్యూహం’ అనే సినిమా ఆర్.సి వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తానని.. తనకు ఇంకా ఆఫీస్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదని తెలిపింది.

Related Posts