అనిల్ రావిపూడి బర్త్ డే గిఫ్ట్ రెడీ?

దసరా బరిలో విడుదలైన ‘భగవంత్ కేసరి’ సృష్టించిన కలెక్షన్ల సునామీ గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ రూ. 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించిందీ చిత్రం. ఇంకా.. రన్ కొనసాగుతూనే ఉంది. లాంగ్ రన్ లో మరెన్నో కోట్లు కలెక్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. లేటెస్ట్ గా ‘భగవంత్ కేసరి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అక్టోబర్ 19న దసరా కానుకగా ‘భగవంత్ కేసరి’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఇక.. నవంబర్ 23 నుంచి ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతుందనేదే ఆ న్యూస్. నవంబర్ 23 అంటే ‘భగవంత్ కేసరి’ డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు.

దీంతో అదే రోజు నుంచి ‘భగవంత్ కేసరి’ని స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తుందట ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ అందుబాటులోకి రానుందట. ఒకవేళ ఇదే గానీ జరిగితే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అమెజాన్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టే.

Related Posts