సినిమాల్లో ఏమైనా జరుగుతాయి. ఒకప్పుడు మనవరాలి వయసున్న హీరోయిన్లతో చిందులు వేశారు మన హీరోలు. అంతేనా వారితో ఐ లవ్యూ అని కూడా చెప్పించుకున్నారు. యాభై యేళ్ల హీరో ఎగురుకుంటూ వచ్చి నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యానమ్మా అనేవాడు. అప్పట్లో నడిచింది. ఇప్పుడు కాస్త కష్టం. ఏ వయసులో ఉన్న హీరోలు వయసు మళ్లిన పాత్రలు చేస్తే ఓకే. కానీ వయసులో ఉన్న హీరోయిన్ చేతనే అలాంటి పాత్రలు చేయిస్తే ఒళ్లు మండిపోతుంది కొందరికి. ఎవరా కొందరు అనిపిస్తోందా.. ఇంకెవరు ఫ్యాన్స్. ఫ్యాన్స్ కే కదా ఏదైనా బాధ అనిపించేది.
రీసెంట్ గా వచ్చిన వీర నరసింహారెడ్డిలో పెద్ద బాలకృష్ణ భార్య పాత్ర చేసిన హనీ రోజ్ వయసు 32యేళ్లు. అదే చిన్న బాలకృష్ణకు హీరోయిన్ గా హనీరోజ్ కు కోడలిగా నటించిన శ్రుతి హాసన్ వయసులు 37యేళ్లు. అయినా అప్పుడు పాస్ అయిపోయింది. కారణం హనీ రోజ్ తెలుగులో పెద్దగా తెలియదు. తనకు ఇక్కడ ఏ ఇమేజ్ లేదు కాబట్టి. బట్ ఇప్పటికీ పాతికేళ్ల పడుచులా కనిపిస్తూ.. ఓ రేంజ్ లో బాడీ మెయిన్టెన్స్ చేస్తోన్న బ్యూటీ త్రిషను మరో హీరోకు తల్లి అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..? అదే జరగబోతోందిప్పుడు.
మెగాస్టార్ చిరంజీవి, బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గా త్రిషను తీసుకుంటున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్, త్రిషతో జతకడుతోన్న రెండో సినిమా ఇది. అయితే ఇందులో మరో జంట కూడా ఉంది. ఆ పాత్రల కోసం ప్రస్తుతం డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డను తీసుకున్నారు. అతనికి జోడీగా శ్రీ లీలను ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ మూవీలో సిద్దు .. చిరంజీవి, త్రిషల కొడుకుగా నటిస్తాడు అనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ అంటే ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ త్రిష అతనికి తల్లి అంటే ఎంత మేకప్ వేసినా ఫ్యాన్స్ హర్టింగ్ అయిపోతారేమో అనేది పెద్ద సందేహం. ఏదేమైనా రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ లో త్రిషను చూసిన వారు తను ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిందా అన్నంతగా మెచ్చుకున్నారు.
మరి ఇరవైయేళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా.. ఏ మాత్రం వన్నె తరగని సోయగంతో వెన్నపూస మాదిరి కనిపిస్తా ఉంది కదా..? అట్టాంటి తను ఇట్టా సిద్ధుకు తల్లిగా నటిస్తుంది అంటే ఎంతమంది హృదయం బద్ధలవుతుంది. అసలా మాటకొస్తే ముందు సిద్ధు గుండె పగిలిపోతుందేమో..?
‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…
The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…
Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…
Lady directors are now on the rise in the Telugu film industry. Veteran actresses like…
On one side, the heat of the election, on the other, IPL. With this, there…