పెళ్లి వద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలట .. మిస్ శెట్టికి

అనుష్కశెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్‌ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. సెప్టెంబర్ 7న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడింగ్ లా ఉంది. చిన్న ఎమోషనల్ కంటెంట్ తో పాటు ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా అనుష్క, నవీన్ మధ్య సన్నివేశాలు చాలా చాలా బావున్నాయి. వీరి కాంబినేషన్ కొత్తగా ఉండటంతో పాటు పాత్రలు కూడా ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.


” ఇంజినీరింగ్ చేసిన స్టాండప్ కామెడీ ఏంటీ అని అనుష్క అడగడంతో మొదలైన ట్రైలర్.. అదే కదా ప్రాసెస్ .. అంటే మీరిప్పుడు చెఫ్ అవ్వాలని గట్టిగ ఫిక్స్ అయిన తర్వాత ఇంజినీరింగ్ చేయలేదా అనే డైలాగ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది.


ఇక ” తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లెందుకు.. ” అనే అనుష్క ప్రశ్నలోనే ఆమె పాత్ర కనిపిస్తుంది. ఆ క్రమంలోనే తనకు సరైన పర్సన్ అని ఈ స్టాండప్ కమెడియన్ ను ఎంచుకుంటుంది. అతనేమో ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తనకు మాత్రం ఏ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు. అలాంటి ఎమోషనల్ లెస్ లేడీని తన ప్రేమలో పడేలా ఎలా చేశాడు.. అనేది మిగతా కథలా కనిపిస్తుంది. ఒక ఎల్డర్ లేడీతో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ కొత్తదేం కాదు. కానీ పెద్దది అయి ఉండి అసలు ప్రేమ, రిలేషన్షిప్, పెళ్లంటేనే ఇష్టం లేని లేడీతో ప్రేమ అనేదే కొత్త పాయింట్.


ఇక ప్రతి మగాడి విజయం వెనక ఒక పెద్ద మహిళ ఉంటుంది అనే డైలాగ్ తో పాటు.. “ప్రపంచంలో నువ్వొక్కడివే మగాడివి అనుకుంటున్నావా.. ” అనే అనుష్క డైలాగ్ ఆమె తన క్యారెక్టర్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉందో తెలియజేస్తుంది. ఇక్కడి నుంచి కథ అబ్రాడ్ కు మారిన తర్వాతే తనలో ఒక ఎమోషన్ స్టార్ట్ అవుతుంది.. అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే చివర్లో.. ఇద్దరూ కలిసి కూర్చుని ఉండగా.. నవీన్ .. ఆమెతో అంటాడు.. అన్విత సిసి టివి కెమెరా ఉందీ అని. దానికి తను నాకు దానితో ఏం ప్రాబ్లమ్ లేదు అంటుంది. .. వెంటనే నవీన్.. ఏం మాట్లాడుతున్నవ్.. వైరల్ అయిపోతాం.. అనే డైలాగ్ ఫన్నీగా ఉంది. మొత్తంగా ఇదో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ రైడ్ లా ఉంది. చిన్న లవ్ స్టోరీ.. హెవీగా లేని ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎలా చూసినా ఈ ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఈ ట్రైలర్ తో సినిమాకు ఓ హైప్ వస్తుందని మాత్రం చెప్పొచ్చు.

Related Posts