టాలీవుడ్

‘డెవిల్’ రిలీజ్ డేట్ ఫిక్సైందా..?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెవిల్‘. ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ లాక్ చేసినట్టు ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బింబిసార’ తో కళ్యాణ్ రామ్ భారీ హిట్ ని అందుకున్నాడు. మూస ధోరణిలో కాకుండా కథ మీద బాగా కసరత్తు చేసి ఒక్కో సినిమాను చాలా ప్లాండ్ గా చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘డెవిల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది.

కాగా, ఈ డిసెంబర్ 29న ‘డెవిల్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. డిసెంబర్ మొదటు వారం (07.12.23) నాని ‘హాయ్ నాన్న’, (22.12.23) న ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ చివరి వారం ‘డెవిల్’ ని రిలీజ్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయట. జనవరి నెలలో సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద ఈసారి భారీ పోటీ నెలకొనబోతుంది. అందుకే, ఇంకా ముందే ‘డెవిల్’ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది.

Telugu 70mm

Recent Posts

Vijay Devarakonda started silently

It is known that rowdy star Vijay Devarakonda is doing a film with Gautham Tinnanuri.…

4 mins ago

ఆసక్తి రేకెత్తిస్తోన్న విజయ్ దేవరకొండ సినిమా పోస్టర్

'ఫ్యామిలీ స్టార్' తర్వాత మళ్లీ దిల్‌రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాజావారు రాణిగారు' ఫేమ్…

1 hour ago

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి బయోగ్రఫీ

వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే…

2 hours ago

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బయోగ్రఫీ

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో 80 నుంచి 90 శాతం మంది వారసత్వంగా వచ్చినవారే. అంతటి…

2 hours ago

మే 17న రీ రిలీజ్ అవుతోన్న ‘అపరిచితుడు’

ప్రస్తుతం జోరుగా సాగుతోన్న రీ రిలీజుల ట్రెండ్ లో విక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'అపరిచితుడు' కూడా చేరింది.…

3 hours ago

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

13 hours ago