రాజమౌళి, మహేష్‌ మూవీ ఆగిపోయిందా..

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్ అంటే మహేష్ బాబు, రాజమౌళిదే. ఈ కాంబోలో సినిమా కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. బట్ జక్కన్న ఒక్కో సినిమాకు చాలా టైమ్ తీసుకుంటూ రిపీటెడ్ హీరోస్ తోనే సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఎన్టీఆర్ నాలుగు సినిమాలు చేశాడు. రామ్ చరణ్ తో రెండు మూవీస్ ఉన్నాయి. ప్రభాస్ మూడు సినిమాలున్నాయి. అతను చేసిందే తక్కువ సినిమాలు. అయినా అపజయమే లేకుండా దూసుకువెళుతున్నాడు కాబట్టే అంత క్రేజ్.

దీనికి తోడు ఈగ నుంచి ఇండియన్ సినిమా రేంజ్ ను మారుస్తూ వెళ్లాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాకు టాలీవుడ్ ను కేరాఫ్‌ గా మార్చాడు. గ్లోబర్ స్టేజ్ పై ఇండియన్ సినిమాను శిఖరంపై నిలబెట్టాడు. ఈ ఇమేజ్ తో హాలీవుడ్ కటౌట్ ఉన్న మహేష్‌ తో సినిమా అంటే కథ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అందుకు తగ్గట్టుగానే వీళ్లు అమెజాన్ అడవుల్లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేసుకున్నారు. గుంటూరు కారం తర్వాత ఈ మూవీ మొదలు కావాలి. కానీ ఈ లోగానే ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.


రాజమౌళి, మహేష్‌ బాబు సినిమా గుంటూరు కారం తర్వాత రావడం లేదు. అందుకు కారణం కథేనట. నిజానికి ఈ మూవీ స్టోరీ ఎప్పుడో రెడీ అయిపోయినట్టుగా కొన్నాళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకు వచ్చాడు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఇందులో మూల కథ రాజమౌళికి ఓకే అయినా.. ఇంకా విస్తరించి కథనం విషయంలో ఇంకా కసరత్తు చేయాల్సిందని అర్థమైందట. అందుకే ఇద్దరూ కలిసి ఈ కథను చెక్కేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నారు. ఈ టైమ్ ఏకంగా ఎనిమిది నెలలకు పైగా ఉంటుందట. అంటే 2024 ఆగస్ట్ వరకూ టైమ్ అడిగారట. దీంతో మహేష్‌ బాబు ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్.


జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఎనిమిది నెలలు టైమ్ ఉంది. ఈ టైమ్ లో చాలా వేగంగా సినిమాలు చేసే దర్శకులెవరైనా ఉన్నారా అని చూస్తున్నాడట. అఫ్‌ కోర్స్ ఆ స్పీడ్ తో పాటు మంచి కథ కూడా ఉండాలి. లేదంటే ఇద్దరూ దెబ్బైపోతారు. ఇక తెలుగులో వేగంగా సినిమాలు తీసే దర్శకుల్లో పూరీ జగన్నాథ్ తో పాటు అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. తమిళ్ నుంచి లోకేష్ కనకరాజ్ ఉన్నాడు. బట్ లోకేష్ ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉన్నాడు. పూరీ డబుల్ ఇస్మార్ట్ మార్చి ఫస్ట్ వీక్ లో విడుదల కాబోతోంది. ఇక అనిల్ రావిపూడి బాలకృష్ణ భగవంత్ కేసరి తర్వాత ఎవరితో చేస్తాడనే క్లారిటీ లేదు. సో.. అన్నీ కుదిరితే రాజమౌళి కంటే ముందు మరో సినిమా చేసే ఛాన్స్ లు చాలానే ఉన్నాయనేది టాలీవుడ్ టాక్. మరి ఈ టాక్ నిజమవుతుందా లేదా అనేది చూడాలి.

Related Posts