టాలీవుడ్

ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న ‘హరిహర వీరమల్లు’

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిచేయాల్సిన సినిమాలు మూడున్నాయి. అవే.. ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే.. ఈ చిత్రాలలో ముందుగా మొదలైంది ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ప్రారంభం జరుపుకుని నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈనేపథ్యంలో.. ముందుగా ‘హరిహర వీరమల్లు’ని పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నాడట పవన్ కళ్యాణ్.

హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ తో ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. తొలుత దర్శకుడు క్రిష్ కొంతభాగాన్ని తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడు ఎ.ఎమ్.రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తిచేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్ పార్ట్ ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ను ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.

డిసెంబర్ లో ‘హరిహర వీరమల్లు-1’ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈనేపథ్యంలో.. ఈ ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌ ఈ మూవీ కోసం కేవలం 20 నుంచి 25 రోజులు సమయం కేటాయిస్తే సరిపోతుందట. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మరోవైపు.. ఈ సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి.

Telugu70mm

Recent Posts

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

14 hours ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

15 hours ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

15 hours ago

Ashika Ranganath

16 hours ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

16 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

16 hours ago