HomeMoviesటాలీవుడ్తగ్గేదే లే అంటోన్న ‘హనుమాన్’

తగ్గేదే లే అంటోన్న ‘హనుమాన్’

-

సంక్రాంతి సీజన్లో మూడు, నాలుగు సినిమాలకు మంచి స్కోప్ ఉంటుంది. ఒక్కో సందర్భంలో అన్ని సినిమాలు విజయాలు సాధించిన దాఖలాలున్నాయి. అయితే రాబోయే సంక్రాంతి బరిలో కేవలం తెలుగు నుంచే అరడజను సినిమాలు పోటీలో ఉన్నాయి.

అవే మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామి రంగా’, రవితేజ ‘ఈగల్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’. ఇవన్నీ వేటికవే క్రేజీ మూవీస్. వీటన్నింటితో పాటు నేను ఉన్నానంటూ సంక్రాంతినే టార్గెట్ చేసింది ‘హనుమాన్’.

‘అ!, జాంబిరెడ్డి’ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. రైటర్ గా, క్రియేటర్ గా కొత్త ఆలోచనలతో దూసుకెళ్తుంటాడు. ఈసారి ఈ యంగ్ డైరెక్టర్ పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ చేసిన చిత్రమే ‘హనుమాన్’.

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ టీజర్ తోనే అందరి అటెన్షన్ ను పొందింది. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

అయితే సంక్రాంతి బరిలో మిగతా సినిమాలకంటే ముందే ‘హనుమాన్’ రాబోతుందనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్. లేటెస్ట్ గా అదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ జనవరి 12న ‘హనుమాన్’ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేశారు. కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ మరికొన్ని భాషల్లోనూ ‘హనుమాన్’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి.. సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య చిన్న చిత్రంగా విడుదలవుతోన్న ‘హనుమాన్’ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

ఇవీ చదవండి

English News