‘కోట బొమ్మాళి’ వంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి: హీరో శ్రీకాంత్

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా ‘కోట బొమ్మాళి’. ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని ‘కోట బొమాళి’ ని రూపొందించారు. జీఏ2 బ్యానర్ ప్పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన అన్నీ ప్రాంతాల నుంచి సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ మీట్ ని నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడు,’ నా కెరీర్ లో ‘కోట బొమ్మాళి’ బెస్ట్ సినిమా. ఇలాంటి సినిమా తీయాలంటే ముందు నిర్మాతలకి గట్స్ కావాలి. ఆ విషయంలో మా బన్నీ వాస్ గురించే చెప్పుకోవాలి. ఇందులో నా పాత్ర అందరినీ మెప్పిస్తున్నందుకు ..ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి, సినీ జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు. కలెక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. అన్నీ ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గీతా ఆర్ట్స్ లో ఇది నాకు నాలుగవ సినిమా. దర్శకుడు తేజ మార్ని మాతో మంచి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఈ సినిమాను ఆదరిస్తున్న అందరికీ మరోసారి థాంక్స్’..అని అన్నారు.

Related Posts