మల్టీవర్స్ లోకి కెప్టెన్ ధనుష్‌

ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ధనుష్‌ ఒకడు. తన పర్సనాలిటీతో పనిలేకుండా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. మాస్ అయినా క్లాస్ అయినా.. యాక్షన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఇరగదీస్తాడు. అందుకే అతని ఖాతాలో రెండు నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. రీసెట్ గా సార్ మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్‌ ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే ”కెప్టెన్ మిల్లర్”.

ఇంతకు ముందు కీర్తి సురేష్, దర్శకుడు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో సాని కాయిదం అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాని కాయిదమ్ మూవీకి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. కీర్తి నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. అందుకే ఈ ఛాన్స్ ఇచ్చాడు ధనుష్‌.

ఇక కెప్టెన్ మిల్లర్ చిత్రం ఒక పార్ట్ గా కాక ఏకంగా మూడు భాగాలుగా వస్తుందట. ఈ మూడు భాగాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందని టాక్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు భాగాల కథ చదివిన తర్వాతే ధనుష్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడంటున్నారు. తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

అలాగే కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడు అనే టాక్ ఉంది. ఇంకా కన్ఫార్మ్ కాలేదు ఇక ఈ మూడు భాగాలను ఒకేసారి విడుదల చేయరు. ముందు ఒక పార్ట్ రిలీజ్ అవుతుంది. బాహుబలి, కేజీఎఫ్‌ లాగా సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా ఎదురుచూసే ట్విస్ట్ తో ముగిస్తారట.

తర్వాత ధనుష్‌ తన డైరెక్షన్ లో కెరీర్ లో 50వ సినిమాను రూపొందించుకుంటాడు. అటుపై మళ్లీ కెప్టెన్ మిల్లర్ స్టార్ట్ అవుతుంది. ఈ లోగా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే మళ్లీ థర్డ్ పార్ట్ కు గ్యాప్ ఉంటుంది. మొత్తంగా ధనుష్ మూవీ కూడా మల్టీవర్స్ లా రాబోతోంది. ఈ మల్టీవర్స్ లో ఇప్పుడు చెప్పుకున్న హీరోలేనా ఇంకా కొత్తగా ఎవరైనా యాడ్ అవుతారా అనేది కూడా చూడాలి.

Related Posts