ఆదిపురుష్‌ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎంతంటే ..?

రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిన ఆదిపురుష్ కు విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ రావణుడుగా నటించాడు. మొదట్లో గ్రాఫిక్స్ విషయంలోచాలా కమెంట్స్ రావడంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసి మళ్లీవిజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ను చేశారు.దీంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది.

రిలీజ్ కు ముందు వరకూ చెప్పిన ఫిగర్ ఏంటంటే.. ఈ చిత్రానికి 490కోట్ల వరకూ బడ్జెట్ అయిందని. సో భారీ టార్గెట్ తోనే బాక్సాఫీస్ బరిలోకి వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిది. చాలామంది అస్సలేం బాలేదు అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా మొదటిరోజు వంద కోట్లు కలెక్ట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకూ ఫస్ట్ డే హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఆర్ఆర్ఆర్ మూవీపై ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే 74 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ ను ఆదిపురుష్‌ బ్రేక్ చేసింది. కానీ అంతా అనుకున్నట్టుగా వంద కోట్లు రాలేదు.


ఓమ్ రౌత్‌ డైరక్ట్ చేసిన ఆదిపురుష్‌ ఫస్ట్ డే కలెక్షన్స్ 95 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా 4వేల స్క్రీన్స్ లో విడుదలైన ఈ మూవీకి మొదటి రోజు ఈ కలెక్షన్స్ అంటే పెద్ద విషయంగానేచెప్పాలి. మిక్స్ డ్ టాక్ వచ్చినా రికార్డ్ కొట్టిందంటే కారణం.. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ముందుగానే భారీగా రాబట్టింది ఆదిపురుష్. తెలుగు ప్రేక్షకులకు సంబంధించి..

ఆ మాటకొస్తేఇందులో నటించిన ఆర్టిస్టుల్లో ప్రభాస్ మాత్రమే మెయిన్ ఎట్రాక్షన్. అయినా ఇది రామాయణం అనే ఇష్టంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఆ కారణంగానే ఈ మూవీ రాబోయే రోజుల్లో టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ సాధించినా ఆశ్చర్యం లేదు అనేది ట్రేడ్ అంచనా. ఏదేమైనా ఈ మూవీ సాధించిన ఫస్ట్ డే రికార్డ్ ఇప్పట్లో చెరిగిపోనిది అనే చెప్పాలి.

Related Posts