‘హద్దులేదురా’ చిత్ర ట్రైలర్ గ్రాండ్ లాంచ్‌

టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వర్ణ పిక్చర్స్ బ్యానర్స్ పై వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్న చిత్రం ‘హద్దులేదురా’. రాజశేఖర్‌ రావి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రంలో ఆశిష్‌ గాంధీ, అశోక్‌ హీరోలుగా వర్ష, హ్రితిక హీరోయిన్లు. మార్చి 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.


”హద్దు లేదురా’.. దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు. సినిమా అద్భుతంగా తీశాడు. చాలా మంచి సినిమా అవుతుంది. మొదటి సినిమా బర్త్ లాంటింది. నా మొదటి సినిమా డాన్ శ్రీను ఇప్పటికీ మర్చిపోలేను. మొదటి సినిమా మనం ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా. రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్ లోనే వున్నాడు. మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు. ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్ కూడా వుంది అన్నారు ముఖ్యఅతిధి డైరెక్టర్ గోపీచంద్ మలినేని.

నాటకం సినిమా టీజర్ లాంచ్ కి గోపీచంద్ గారు వచ్చారు. అదే సెంటిమెంట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్షిప్ మూవీ. రాజశేఖర్ చాలా పాషన్ తో సినిమా చేశారన్నారు హీరో ఆశిష్‌ గాంధీ.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు గోపీచంద్ మలినేని గారికి ధన్యవాదాలు. జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని చెబుతూ ఈ చిత్రానికి హద్దులేదురా అనే టైటిల్ పెట్టడం జరిగింది. లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు. నిర్మాత వీరేష్ అద్భుతంగా సపోర్ట్ చేశారన్నారు దర్శకుడు రాజశేఖర్‌ రావి.

Related Posts