నాలోని హీరో గా కంటే నటుడే నాకు చాల ఇష్టం – ప్రియదర్శి

ఓం భీమ్‌ బుష్.. కడుపుబ్బానవ్వించడానికి వస్తున్నారు హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ లు. హుషారు ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్‌లో వి సెల్యులాయిడ్, సునీల్ బులుసు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిందీ చిత్రం యువి క్రియేషన్స్ ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రం మార్చి 22న గ్రాండ్ గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
‘ఓం భీమ్ బుష్’ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. శ్రీ విష్ణు, రాహుల్ అనేసరికి ఇంకా ఆసక్తి పెరిగింది. అలాగే యువీ లాంటి బలమైన నిర్మాణ సంస్థ వుండటం.. ఇలా అన్నీ కుదిరాయి. కథలో చాలా ఇంట్రస్టింగ్ ఐడియా వుంది. దానికి ఫాంటసీ, హారర్ ఎలిమెంట్ కూడా యాడ్ చేయడం ఇంకా క్రేజీగా అనిపించింది. అలాగే స్నేహితులతో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు ప్రియదర్శి.
ఇందులో నా పాత్ర పేరు డా. వినయ్ గుమ్మాడి. మా ఫ్రెండ్స్ అంతా ఉస్మానియాలో పీహెచ్డీ చేయాలనీ చేరుతాం. కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం అక్కడ వచ్చే స్టయిఫండ్ , ఉచిత హాస్టల్ సౌకర్యం కోసం. నాది సైన్స్ ని బిలివ్ చేసే పాత్ర. మిగతా ఇద్దరు మాత్రం మంత్రాలు, తంత్రాలని నమ్ముతారు. అలా మా ముగ్గురి మధ్య మంచి హ్యుమర్ వుంటుంది. సినిమా అంతా ఎంటర్ టైన్ మెంట్ వుంటుందన్నారు.
ఈ సినిమాలో ఆయేషా ఖాన్ నాకు జోడి. కానీ రొమాంటిక్ సాంగ్స్ ఉండవన్నారు. ఇది బడ్డీ కామెడీ మూవీ. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా అందరూ ఎంజాయ్ చేశా చాలా క్లీన్ గా సినిమా చేశాం. ఇది బ్రోచేవారెవరురా సినిమాకి సీక్వెల్ కాదు. ‘ఓం భీమ్ బుష్’ అలా కాదు. మేం ముగ్గురం తింగరి పనులు చేసి సమస్యలలో ఇరుక్కుంటాం. దానికి దీనికి చాలా తేడా వుంది. సీక్వెల్ కాదని స్పష్టం చేసారు ప్రియదర్శి.
మంగళవారంలో హీరో స్థాయి పాత్ర చేసాను.. హీరోగా కంటే నటుడుగా చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతానన్నారు.
నటుడిగా వుంటే చాలా స్వేఛ్చగా ఒక నదిలా హాయిగా ప్రవహించవచ్చు. నటుడిగా వుంటే ఎక్కువ వైవిధ్యం చూపించవచ్చు. అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది నా నమ్మకం. మంగళవారంలో కూడా ఒక ముఖ్యపాత్రగానే వుంటాను కానీ హీరోగా వుండను. ఇలాంటి మంచి పాత్రలు ఇస్తున్న రచయిత, దర్శకులు వుండటం నా అదృష్టమన్నారు.
నిర్మాతలు సునీల్ గారు, వంశీ గారు సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. అద్భతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వుంటాయి. ఇందు భారీ మహల్ సెట్ వుంటుంది. ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్ వేశారు. అలాగే సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.
అసలు కథగా అనుకున్నప్పుడు ముందుగా ఈ టైటిల్ అనుకోలేదు. కానీ రానురాను షూటింగ్ చేస్తుండగా, మా ముగ్గురి మధ్య వుండే రాపోతో ఈనాటి ట్రెండ్ కు తగినట్లు మాట్లాడే భాషతో షడెన్ గా పుట్టిన టైటిల్ ‘ఓం భీమ్ బుష్’. ఇలాంటి పదం గతంలో మనం చాలాసార్లు వినేవాల్ళం. చాలా కేచీగా వుంటుందనిపించింది. అలాగే ఈ సినిమాకు టైటిల్ ఓ ఎసెట్ గా అనిపించింది.
సహజంగా యూత్ బయట మాట్లాడుకునే మాటలే సహజత్వం కోసం సినిమా పరంగా కథపరంగా కొన్నిడైలాగ్స్ లు అలా వస్తుంటాయి. కానీ ఎక్కడా అసభ్యతకు తావులేకుండా వుంటాయన్నారు.
నేను పెళ్లిచూపులు టైంలో టీనేజ్ లో వున్నాను. ఆ తర్వాత సినిమా సినిమాకూ వస్తున్న రెస్సాన్స్ చూసి నాలోతెలీని మార్పు గమనించాను. మంగళవారం తర్వాత నాలో తెలీని మార్పు కనిపించిందన్నారు.
దర్శకుడు హర్ష టాలెంట్ దర్శకుడు. హర్ష నాకు 12 ఏళ్ళుగా తెలుసు. హుషారు ముందు సినిమా చేయాల్సింది కుదరలేదు. రౌడీబాయ్స్ టైంలలో కథ చెప్పాడు. అదీ కుదరలేదు. ఇప్పుడు మూడోసారి కుదిరింది. రాహుల్ 12 ఏళ్ళుగా తెలుసు. శ్రీ విష్ణుతో ఉన్నది ఒక్కటే జిందగీ నుంచి తెలుసు. స్నేహితులతో కలసి సినిమా చేస్తున్నపుడు ప్రతి క్షణం మెమరబుల్ గానే వుంటుంది. మా ముగ్గురికీ ఒకే పోలిక వుంది. మేం ఇండస్ట్రీలో స్వయంగా ఎదిగాం. అలా సినిమా రంగం మమ్మల్ని ప్రోత్సహించింది. ఇందుకు ఆడియన్స్ కు మన్సూర్తిా క్రుతజ్జతలు తెలియజేసుకుంటున్నామన్నారు.
లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. అలాగే గేమ్ ఛేంజర్ లో కూడా నటిస్తున్నానన్నారు.

Related Posts