ఓపెనింగ్ బావుంది.. ఊపు కొనసాగుతుందా..

సెప్టెంబర్ నెలంతా సినిమాలే సినిమాలు అంటూ కొన్నాళ్లుగా చెప్పుకుంటున్నాం. పైగా ఇవన్నీ మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ కావడంతో కంట్రీ మొత్తం ఈ సినిమాల కోసం ఈగర్ గా చూస్తోంది. అందులో మొదటగా వచ్చిన సినిమా ఖుషీ. ఈ శుక్రవారం విడుదలైన ఖుషీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ మూవీ ఆ టాక్ తెచ్చుకోవాలని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే హిట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. ఒక రకంగా సెప్టెంబర్ కు ఖుషీ రూపంలో మంచి బోణీ దొరికింది. ఈ హిట్ మిగతా సినిమాలకు కూడా ఓ కొత్త జోష్ ఇస్తుంది.

ఇక నెక్ట్స్ వీక్ 7వ తారీఖున మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలు విడుదల కాబోతోంది. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి నటించిన ఈ చిత్రంపై అంచనాలున్నాయి. వాటిని నిలబెట్టుకుంటుందనే హోప్ ఖుషీ ఇచ్చింది. దీంతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే కొత్త రికార్డులు ఖాయం అనేలా ఉంది. మొత్తంగా ఖుషీ ఇచ్చిన పాజిటివ్ ఓపెనింగ్ ను ఈ నెలంతా కంటిన్యూ చేయబోతున్నారా లేదా అనేది నెక్ట్స్ వీక్ విడుదల కాబోతోన్న ఈ రెండు సినిమాల రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది.


ఏదేమైనా ఖుషీతో విజయ్ దేవరకొండ కోరుకున్న విజయం సాధించాడు. ఊళ్లో లేకపోయినా సమంత సైతం ఓవర్శీస్ లో ఈ మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మరి ఈ పాజిటివ్ ఓపెనింగ్ ఊపు నెలంతా కొనసాగాలనే కోరుకుందాం.

Related Posts