గోట్‌లైఫ్ (ఆడు జీవితం) సెలబ్రిటీ ప్రీమియర్‌ షో

పృథ్విరాజ్‌ సుకుమారన్ లీడ్ చేసిన మూవీ ఆడు జీవితం ( గోట్‌ లైఫ్) . నజీబ్ అనే ఓ వ్యక్తి నిజ జీవిత గాధతో బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు.

ఈ చిత్రం మార్చి 28 న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలకు ఈ సినిమా ప్రీమియర్ షో వేసారు. ఈ చిత్రం చూసిన తెలుగు సినిమా డైరెక్టర్స్‌, ఇతర ఆర్టిస్టులు అద్బుతంగా ఉందంటూ మెచ్చుకుంటున్నారు.


ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షో లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, దర్శకులు హను రాఘవపూడి, అజయ్ భూపతి, శివ నిర్వాణ, పి.మహేశ్ బాబు, ప్రవీణ్ సత్తారు, శ్రీను వైట్ల, కిషోర్ తిరుమల, చంద్రసిద్ధార్థ్ పాల్గొన్నారు.

Related Posts