‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజయ్యింది. ఇదొక రకంగా ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఓ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో విలన్లు అల్లరి చేస్తుంటే.. పవర్ ఫుల్ పోలీసాఫీర్ గా సీన్ లోకి ఎంటరైన పవర్ స్టార్.. గాజు గ్లాస్ గురించి చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పెషల్ గ్లింప్స్ లో ‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.. కచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం..’ అంటూ సాగే ఈ డైలాగ్స్ జనసేనాని పార్టీ సిద్ధాంతాలుగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకెల్లేలా ఉన్నాయి.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ‘గబ్బర్ సింగ్’ తరహాలోనే కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ స్పెషల్ గ్లింప్స్ చివరిలో హీరోయిన్ శ్రీలీల ఎంట్రీ కూడా అదిరింది. మొత్తంమీద.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే.. గ్లింప్స్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.

Related Posts