‘బాహుబలి’ నిర్మాతలతో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా!

‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లతో పాటు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తూ ఒకేసారి ‘ఆక్సిజన్, డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్‘ అంటూ రెండు సినిమాలను ప్రకటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక.. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయకుడు ఒక్కడే. అతనే మాలీవుడ్ యాక్టింగ్ పవర్ హౌస్ ఫహాద్ పాజిల్.

ఫహాద్ ఫాజిల్ హీరోగా రూపొందుతోన్న ‘ఆక్సిజన్, డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్‘ రెండు సినిమాలూ త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి. ముందుగా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ జూన్ నుంచి పట్టాలెక్కి.. 2025లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ‘ఆక్సిజన్’ కూడా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుందట. రెండు సినిమాలను తెలుగు, మలయాళంతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో తీసుకురాబోతున్నారు.

మరోవైపు ‘పుష్ప‘ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఫహాద్.. తన అనువాద సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకూ బాగా సుపరిచితుడే. ఇక.. ఇటీవలే మలయాళంలో ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ‘ప్రేమలు’ చిత్రాన్ని ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో విడుదల చేశాడు. ‘ప్రేమలు’ తెలుగులోనూ ఘన విజయాన్ని

Related Posts