గ్లామర్‌ క్వీన్‌ అప్సరరాణి కొత్త సినిమా ప్రారంభం

అప్సర రాణి అనగానే ఆర్జీవి హీరోయిన్ అంటారు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లేడీగా పేరు తెచ్చుకున్న అప్సర వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అరుణ్‌ ఆదిత్ తో జోడీ కడుతున్న కొత్త సినిమా ఈరోజు (మార్చి 20) న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది.

పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌నివ్వగా.. ఎంఎం శ్రీలేఖ కెమెరా స్విచ్చాన్‌ చేయగా.. తొలిషాట్‌కు వి సముద్ర డైరెక్ట్‌ చేసారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.


మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు అప్సరరాణి.


దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్‌, మిగతా ఆర్టిస్టులు చిత్ర విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసారు.

Related Posts