మలయాళంలో చరిత్ర సృష్టించిన ‘మంజుమ్మెల్ బాయ్స్‘

ఈ ఏడాది ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్ బాయ్స్‘ కలెక్షన్ల పరంగా మాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దశాబ్దాల పాటు కొనసాగుతోన్న మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ‘మంజుమ్మెల్ బాయ్స్‘ అగ్ర స్థానంలో నిలిచింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది.

2006లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా చిదంబరం అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. షౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్ఘీస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కోచికి సమీపంలోని మంజుమ్మెల్ అనే టౌన్ కి చెందిన కుర్రాళ్ల కథ ఇది. ‘మంజుమ్మెల్ బాయ్స్‘ వెకేషన్ కోసం తమిళనాడులోని కొడైకెనాల్ వెళ్లడం.. అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కొడైకెనాల్ లో కమల్ హాసన్ ‘గుణ‘ సినిమా చిత్రీకరించిన ప్రదేశాల్లోనే ఈ సినిమాని చిత్రీకరించారు. ఇక.. ఈ మూవీలో ‘గుణ‘ రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. అందుకే.. కేరళతో పాటు తమిళనాడులోనూ ‘మంజుమ్మెల్ బాయ్స్‘కి మంచి రెస్పాన్స్ దక్కింది.’

మాలీవుడ్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో ‘మంజుమ్మెల్ బాయ్స్‘ నంబర్ 1 గా నిలిస్తే.. ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో ‘2018, పులిమురుగన్, లూసిఫర్, ప్రేమలు‘ చిత్రాలున్నాయి. వీటిలో ‘ప్రేమలు‘ బాక్సాఫీస్ రన్ కూడా కొనసాగుతూనే ఉంది

Related Posts