‘కన్నప్ప’ కామిక్ బుక్ విడుదల చేసిన విష్ణు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో విష్ణు ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. తాజాగా నట ప్రపూర్ణ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1‘ని లాంచ్ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది.

ఈ కామిక్ బుక్ లాంఛ్ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. కామిక్ పుస్తకం.. సినిమా లానే ఉంటుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నాను. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు. ఈ కథ నా మనసుకెంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అన్నారు.

Related Posts