శ్రీవిష్ణుకి గీతా ఆర్ట్స్ స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

టాలీవుడ్ లోని ప్రెస్టేజియస్ ప్రొడక్షన్ హౌసెస్ లో గీతా ఆర్ట్స్ ఒకటి. 50 ఏళ్లకు పైగా సుధీర్ఘ ప్రస్థానం ఉన్న గీతా ఆర్ట్స్ లో నటించాలని ఎంతోమంది హీరోలు కలలు కంటారు. ఇప్పుడు ఆ అవకాశం యంగ్ హీరో శ్రీ విష్ణుని వరించింది. ఈరోజు (ఫిబ్రవరి 29) శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా.. గీతా ఆర్ట్స్ సంస్థ శ్రీవిష్ణుతో సినిమాని అనౌన్స్ చేసింది. శ్రీవిష్ణు 18వ చిత్రంగా రూపొందే ఈ చిత్రానికి SV18 అనేది వర్కింగ్ టైటిల్. గీతా ఆర్ట్స్ తో కలిసి కళ్యా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ రాజు డైరెక్టర్. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి ఇతర కాస్టింగ్ అండ్ క్రూ డిటెయిల్స్ తెలియనున్నాయి.

Related Posts