సెప్టెంబర్ 15 ట్రైయాంగిల్ ఫైట్ ఉందా లేదా

సెప్టంబర్ 15.. తెలుగులో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఒకటి తెలుగు, రెండు డబ్బింగ్ మూవీస్. స్ట్రెయిట్ మూవీ అని కాదు కానీ ఎలా చూసినా.. తెలుగు నుంచి విడుదలవుతున్న స్కంద పైనే అంచనాలున్నాయి. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన ఫస్ట్ మూవీ ఇది. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ లో మరీ కొత్తదనం లేకపోయినా.. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషన్ కనిపిస్తున్నాయి. ఇవి రెండూ కరెక్ట్ గా కనెక్ట్ అయితే కాసుల వర్షం కురుస్తుందని బోయపాటి గత చిత్రాలే చెప్పాయి.

ఇటు రామ్ కు ఈ తరహా పాత్ర కొత్త, ఫస్ట్ టైమ్. ఇది కూడా ప్లస్ అవుతుంది. దీనికి తోడు బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. రామ్ కెరీర్ లోనే.. ఆ మాటకొస్తే టైర్ 2 హీరోల్లోనే ది బెస్ట్ బిజినెస్ అయిందీ చిత్రానికి ఏకంగా 98 కోట్లు డిజిటల్ రైట్స్ గానే వచ్చాయి. 60 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది. ఎలా చూసినా టేబుల్ ప్రాఫిట్స్ తో ఉంది. ఇక థియేటర్స్ లో కూడా హిట్ అనిపించుకుంటే డిస్ట్రిబ్యూటర్స్ ఖుష్ అవుతారు. అయితే ఈ చిత్రంతో పాటు రెండు తమిళ్ మూవీస్ తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్నాయి.

వీటిలో కాస్త ఎక్కువ ఆకట్టుకుంటోన్న సినిమా చంద్రముఖి2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. 17యేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలున్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కాకపోతే పాత ఫ్లేవర్ అలాగే ఉన్నట్టుగా ఉంది. మరి ఈ ఫ్లేవర్ ఇప్పటికీ రిలవెన్స్ గా ఉంటే సినిమా హిట్ అయినట్టే. దీనికి తోడు కంగనా రనౌత్ నటన, లారెన్స్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించడం, వడివేలు కామెడీ హైలెట్ అయ్యేలా ఉన్నాయి.

ఇక మరో సినిమా మార్క్ ఆంటోనీ. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ ట్రైలర్ చూసి చాలామంది నవ్వుకున్నారు. అంత అవుట్ డేటెడ్ గా ఉంది. ముఖ్యంగా విశాల్ గెటప్పులు, విగ్, గెడ్డం ఇవన్నీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. అతని ఇమేజ్ కు భిన్నంగా కనిపిస్తున్నా.. ట్రైలర్ కూడా ఏమంత ఆకట్టుకోలేదు. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్. ఎస్జే సూర్య, అభినయ, కింగ్స్ లే కీలక పాత్రల్లో నటించారు. సో ఈ మూడు సినిమాలూ వస్తే ట్రైయాంగిల్ ఫైట్ గా ఉంటుంది.

కానీ .. స్కంద వాయిదా పడుతుంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. స్కంద చిత్రాన్ని సెప్టెంబర్ 28న సలార్ డేట్ లో విడుదల చేస్తారు అంటున్నారు. అలా అయితే సెప్టెంబర్ 15కేవలం డబ్బింగ్ సినిమాలకే పరిమితం అవుతుంది. నిజానికి స్కంద ఇప్పుడు వస్తేనే బెటర్ అనేది చాలామంది అభిప్రాయం. ఈ రెండూ డబ్బింగ్ సినిమాలు కావడం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ రామ్ కే ఉంటుంది. సినిమా బావుంటే బ్లాక్ బస్టర్ ఫిక్స్ అవుతుంది. అందుకే ఈ డేట్ లో ఉంటే బావుంటుందంటున్నారు. మరి ఈ డేట్ లోనే ఉంటారా లేదా అనేది చూడాలి.

Related Posts