భయానికి మారుపేరు ‘దేవర’

భయానికి మారుపేరు మా ‘దేవర’.. బిగ్ స్క్రీన్ పై మాసివ్ షో కి రెడీగా ఉండండి అంటూ ‘దేవర’ సినిమాకి సంబంధించిన కౌంట్ డౌన్ షురూ చేశారు మేకర్స్. ‘దేవర’ చిత్రానికి ఇంకా 150 రోజులు మాత్రమే ఉందంటూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎటు చూసినా సముద్రమే.. మధ్యలో నిలబడ్డ ఎన్టీఆర్ రెండు చేతుల్లోనూ ఆయుధాలను చేపట్టి ఉన్న ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది

రెండు భాగాలుగా రాబోతున్న ‘దేవర’ చిత్రంలోని మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదలకాబోతుంది. అంటే.. ఇంకా ఈ సినిమా విడుదలకు 150 రోజులు ఉందన్న మాట. ఇటీవలే గోవాలో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు డైరెక్టర్ కొరటాల శివ. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవర గా సరికొత్తగా అలరించనున్నాడట. ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీక్వెన్సెస్ ను తీర్చిదిద్దుతున్నారట. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అనిరుధ్, రత్నవేలు, సాబు సిరిల్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ‘దేవర’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts