టాలీవుడ్

యశ్ పై ఫ్యాన్స్ అసహనం

కేజీఎఫ్ తో అనూహ్యంగా ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు యశ్. అంతకు ముందు శాండల్ వుడ్ లో అతనో సాధారణ హీరో. పెద్ద స్టార్డమ్ కూడా లేదు. అలాంటి యశ్ కేజీఎఫ్ తో ఒక్కసారిగా కంట్రీ మొత్తం ఫేమ్ అయ్యాడు. ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను కేజీఎఫ్ చాప్టర్2తో మరోసారి ఆకట్టుకున్నాడు. అతని స్క్రీన్ ప్రెజెన్స్.. ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ఈ మూవీకి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

దీంతో ఇక యశ్ కంటిన్యూస్ గా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తాడు అనుకున్నారు చాలామంది. బట్ అతను మాత్రం ఆత్మరక్షణలో పడ్డాడు. ఏకంగా యేడాదిన్నకు పైగా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఓ భారీ ప్రాజెక్ట్ తోనే వస్తాడు అని భావించారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టుగా మధ్యలో శాండల్ వుడ్ నుంచే కొన్ని పెద్ద పెద్ద దర్శకుల పేర్లు వినిపించాయి. అవేవీ వర్కవుట్ కాలేదు.

ఓ దశలో ఏ హర్ష అనే దర్శకుడితో చేస్తున్నాడు అని ఆల్మోస్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేముందు క్యాన్సిల్ అయింది. ఆ దర్శకుడు ఇప్పుడు తెలుగులో గోపీచంద్ తో భీమా అనే సినిమా చేస్తున్నాడు. ఇక 18నెలల గ్యాప్ తర్వాత యశ్ నుంచి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇది ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఊహించింది కాదు.


కేజీఎఫ్ లాంటి బిగ్ మాస్ ఎంటర్టైనర్ తర్వాత మరోసారి ఆ తరహా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్ టైనర్ తోవస్తాడు అనుకుంటే యశ్ మాత్రం ఓ మహిళా దర్శకురాలితో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మహిళ కాబట్టి ఇక్కడ తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలోనే అతనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఆ మహిళా దర్శకురాలు తక్కువేం కాదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మళయాలంలో ఓ వెలుగు వెలిగింది. 1986లో నటిగా తెరంగేట్రం చేసిన తను ఫస్ట్ మూవీ ఒన్నుమ్ మూథల్ పూజ్యం వరే( ఒకటి నుంచి సున్నా వరకూ)తో బెస్ట్ యాక్ట్రెస్ గా కేరళ స్టేట్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ తో తనలోని దర్శకురాలిని చూపించిన తను తర్వాత లయర్స్ డైస్ (Liar’s Dice) అనే హిందీ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.


అటుపై నివిన్ పాలీతో తీసిన మూథాన్ అనే సినిమా తనలోనిస సిసలైన దర్శకురాలిని చూపించింది. ఈ మూవీ కూడా అనేక అవార్డులు అందుకుంది.

అలాంటి గీతూ మోహన్ దాస్ తీయబోయే మూడో సినిమాతో యశ్ హీరోగా నటిస్తున్నాడు. మరి ఇది కూడా అవార్డ్ విన్నింగ్ మూవీ అవుతుందా లేక బాక్సాఫీస్ విన్నింగ్ మూవీ అవుతుందా అనేది చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందంటున్నారు.

Telugu 70mm

Recent Posts

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

2 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

2 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

5 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

6 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

8 hours ago

‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…

8 hours ago