టాలీవుడ్

ఎక్స్ క్లూజివ్.. ప్రాజెక్ట్ కే టైటిల్ తెలిసింది

ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో ప్రాజెక్ట్ కే ఒకటి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకోణ్, దిశా పఠానీ వంటి భారీ తారాగణం నటిస్తోన్న ఈ మూవీ ఇండియన్ హిస్టరీలోనే ఓ కొత్త అధ్యాయం సృష్టిస్తుంది అంటున్నారు. ఇంతకు ముందు కేవలం రెండు సినిమాలు మాత్రమే తీసిన నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం కోసం సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఏకంగా 800 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నాడు.

రెండు భాగాలుగా రాబోతోన్న ప్రాజెక్ట్ కే నుంచి ఫస్ట్ పార్ట్ 2024 సంక్రాంతికి విడుదలవుతుందని మూవీ టీమ్ నుంచే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఈ సినిమాలోవిలన్ గా నటించేందుకు కమల్ హాసన్ ఒప్పుకున్న తర్వాత ప్రాజెక్ట్ కే స్పాన్ డబుల్ అయింది.

కమల్ లాంటి గ్లోబల్‌ స్టార్.. లోక నాయకుడు ప్రభాస్ కు విలన్ గా నటించడం అంటే ఇక ఊహలకే అందడం లేదు అని చెప్పాలి. కానీ కమల్ లాంటి స్టార్ ఇలాంటి ఓ కథను ఓకే చేశాడు అంటే అందులో ఎంత స్టఫ్‌ ఉండాలి.

అందుకే ఇప్పటి వరకూ మనం ఏ హాలీవుడ్ సినిమాలను చూసి అబ్బా అనుకున్నామో.. అలాంటి హాలీవుడ్ వాళ్లు కూడా బాప్ రే అనుకునేలా ఈ చిత్రం ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అయితే సినిమా ప్రారంభం అయిన దగ్గర్నుంచీ ప్రాజెక్ట్ కే అంటే ఏంటీ అనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది.

ప్రాజెక్ట్ వరకూ ఓకే. మరి కే అంటే అర్థం టైటిల్ నే కదా సూచిస్తుంది. ఆ టైటిల్ గా ఇప్పటి వరకూ ” కల్కి” అనే అనుకుంటున్నారు చాలామంది. ఇది కలియుగ అంతం నేపథ్యంలో ఉంటుందనీ.. ఆ అంతానికి కారణం కమల్ హాసన్ పాత్ర అవుతుందనే రూమర్స్ కూడా వచ్చాయి. బట్ ప్రాజెక్ట్ కే లో కే అంటే కల్కి కాదు.. ” కాలచక్ర”.


యస్.. ” కాలచక్ర” అనేదే ఈ సినిమా టైటిల్. ఈ మేరకు టైటిల్ ను త్వరలోనే యూఎస్ లో ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కే కామిక్ కాన్ ఈవెంట్ కు సెలెక్ట్ అయింది. ఈ ఈవెంట్ కు సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. అక్కడ సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ ను కూడా ప్రదర్శించబోతున్నారు.

ఆ సందర్భంగానే ఈ ” కాలచక్ర” టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ ఈనెల 19న అమెరికాలోని శాన్ డియాలో జరగబోతోంది. మొత్తంగా ప్రాజెక్ట్ కే లో కే అంటే ఏంటీ అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇక ఈ టైటిల్ అన్ని భాషలకు కరెక్ట్ గానే సూట్ అవుతుంది. మార్చాల్సిన అవసరం కూడా లేదు.


టైటిల్ ను బట్టి చూస్తే ఇది టైమ్ ట్రావెల్ కు సంబంధించిన సినిమా అన్న విషయం కూడా తెలిసిపోతుంది. అయితే టైమ్ ట్రావెల్ అనేది ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ఉంటుందనే చిన్న సమాచారం మాత్రం సినిమా టీమ్ నుంచి ఉంది. సో.. ఇక ఈ కాలచక్రంలో ప్రేక్షకులు కూడా ప్రయాణం చేసేలా ఓ అద్బుతమైన విజువల్ వండర్ లా ఈ సైన్స్ ఫిక్షన్ కథ రాబోతోందన్నమాట.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

11 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

14 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

14 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

14 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

15 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

20 hours ago