అన్నయ్య అందంగా ఉంటే చాలా ఎస్కేఎన్

ఇండస్ట్రీలో హిట్లూ ఫ్లాపులు కామన్. ఇందుకు మినీ స్టార్స్ నుంచి మెగాస్టార్ వరకూ ఎవరూ అతీతం కాదు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో.. ఎందుకు పోతుందో ముందే అంచనా వేయడం అందరికీ సాధ్యం కాదు.అలా అంచనా వేయగలిగేవారు కూడా ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. కొన్నిసార్లు మాత్రం ఇండస్ట్రీ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ఓ సినిమా పోతుంది అని ఫిక్స్ అవుతారు.

అలాంటివి అరుదు. ఆ అరుదైన సినిమాల లిస్ట్ లో భోళా శంకర్ కూడా ఉంటుంది. ఈ మూవీ ఆరంభం నుంచి విడుదల వరకూ ఏ దశలోనూ ఓ హై మూమెంట్ తెచ్చుకోలేదు. టీజర్, పాటలు ఇవేవీ ఆకట్టుకోలేదు. ట్రైలర్ చూశాక చాలా రొటీన్ సినిమా అనిపించుకుంది. అయినా బాస్ సినిమా హిట్ కావాలని ఫ్యాన్స్ మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కోరికలను బట్టి కాక కథలను బట్టి కదా సినిమాలు హిట్ అవుతాయి. ఆ విషయంలో భోళా శంకర్ చాలా చాలా వీక్ అనిపించుకుంది. అందుకే పోయింది. ఈ విషయం మెగాస్టార్ కు తెలుసు. అందుకే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై కాన్ సెంట్రేట్ చేశాడు.


అయితే భోళా శంకర్ ఫ్లాప్ అనే మాయలో అభిమానులు పడిపోయారు తప్ప ఫ్లాప్ కాదు అంటూ తాజా బ్లాక్ బస్టర్ నిర్మాత ఎస్కేఎన్ చేసిన విశ్లేషణ ఇప్పుడు నవ్వుల పాలవుతోంది. బేబీతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఎస్కేఎన్ లో కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మధ్య హాస్టల్ బాయ్స్ ఫంక్షన్ కు వచ్చి అమ్మాయిల హాస్టల్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందని చెప్పి విమర్శల పాలయ్యాడు. ఇప్పుడు మెగాస్టార్ మూవీ విషయంలో చేసిన విశ్లేషణతో అభాసుపాలవుతున్నాడు.


తాజాగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ కు అటెండ్ అయ్యాడు ఎస్కేఎన్. ఈ సందర్భంగా భోళా శంకర్ లో బాస్ ఇంతకు ముందెప్పుడూ లేనంత అందంగా ఉన్నారనీ.. సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రాప్ లో పడి దాన్ని డిజాస్టర్ చేసుకున్నారని అభిమానులను ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు అతన్ని నవ్వులు పాలు చేస్తోంది. బాస్ అందంగా ఉంటే సినిమా హిట్ చేయాలా లేకపోతే.. కథ, కథనాలు బావున్నాయని చేయాలా అనే చిన్న లాజిక్ ను ఎలా మిస్ అయ్యాడు ఎస్కేఎన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతెందుకు మెగా ఫ్యాన్స్ కు సైతం ఈ అనాలిసిస్ నచ్చలేదు.


ఎస్కేఎన్ లెక్కలో చూసుకుంటే వాల్తేర్ వీరయ్యలో బాస్ అందంగా లేడు అనే కదా.. మరి ఆ సినిమా హిట్ అయింది కదా..? గాడ్ ఫాదర్ లో అందంగా లేడు. ఆ మూవీకి ఇన్ని విమర్శలు రాలేదు కదా.. సైరా దారుణంగా కనిపించాడు.. అయినా ఓవర్శీస్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించింది కదా.. సో.. కంటెంట్ ను బట్టే కలెక్షన్స్ తప్ప.. అందాన్ని బట్టి కాదు కదా.. ? ఏదేమైనా వేదికలపై మాట్లాడుతున్నప్పుడు ప్రతి పదమూ ఆచితూచే ఉండాలి. లేదంటే ఇలాగే అభాసుపాలవుతారు.

Related Posts