ఊహలకూ అందనంతగా కాంతార2

అనూహ్యమైన బ్లాక్ బస్టర్స్ అనే మాటకు అక్షర రూపం కాంతార సినిమా.కన్నడలో రూపొంది ఈ చిత్రం గురించి ఎవరికీ తెలియదు.ఈ చిత్ర దర్శక హీరో రిషభ్ శెట్టి కన్నడలో కూడా పెద్ద స్టార్ కాదు. అయినా అతనో మ్యాజిక్ చేశాడు.

ఆ మ్యాజిక్ రివ్యూస్ రూపంలో ఇండియా మొత్తం తెలిసింది. కట్ చేస్తే అన్ని భాషల్లో డబ్ అయింది. డబ్ అయిన ప్రతి చోటా డబ్బుల వర్షం కురిపించింది.

కేవలం 17 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల వరకూ వసూళ్లు సాధించి తలపండిన ట్రేడ్ అనలిస్ట్ లను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. రిషభ్ శెట్టి, సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేజీఎఫ్ ఫేమ్ హొంబలే పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ఓ సంచలనం అనే చెప్పాలి.భూతకోల అనే ప్రాచీన కన్నడ సంప్రదాయాన్ని వెండితెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు దర్శక హీరో రిషభ్ శెట్టి.


ఇంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ మొదలుపెట్టాడు రిషభ్.ప్రీక్వెల్ కోసం హొంబలే పిక్చర్స్ బ్యానర్ రిషభ్ ఏం అడిగినా నో చెప్పడం లేదు. మొదటి పార్ట్ లో తెలిసిన ఆర్టిస్టులు పెద్దగా లేరు. బట్ ఈ సారి స్టార్ కాస్ట్ యాడ్ కాబోతోందట.కంట్రీ మొత్తం తెలిసిన నటీనటులను తీసుకుంటున్నాడు రిషభ్.టెక్నీషియన్స్ ను కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే బడ్జెట్ భారీ అవుతోందట.

అయితే బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ ఏ అడ్డూ చెప్పడం లేదంటున్నారు. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఈ చిత్రానికి ఏకంగా 100 కోట్లు బడ్జెట్ కేటాయించారట. ఇందులోనే ప్రమోషన్స్ కూడా కలిపి ఉంటాయని సమాచారం. రిషభ్ రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉందని సమాచారం.


ఇక అక్టోబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతోంది. కేవలం ఐదు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ను కూడా వేగంగా పూర్తిచేసి వచ్చే సమ్మర్ లోనే విడుదల చేసేలా ప్రణాళికలు చేసుకున్నాడు రిషభ్. రిషభ్ ప్లానింగ్ కు తిరుగుండదు అని అతని గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. పైగా అతనికి ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా బాగా ఉంటుంది.

మొత్తంగా సమ్మర్ రిలీజ్ ప్లానింగ్ తో వస్తున్నాడు రిషభ్.
ఇక ఈ చిత్ర కంటెంట్ ఎవరి ఊహలకూ అందదు అంటున్నారు.కాంతార కథ కంటే ముందే జరిగే కథలా ఈ సినిమా ఉండబోతోంది. కాంతారనే 1990ల నేపథ్యంలో చూపించారు. అంటే ఇంకా వెనక్కి వెళతారన్నమాట. మరి ఈ కథలో మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts