టాలీవుడ్

దుల్కర్ టాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తున్నాడా

మోస్ట్ టాలెంటెడ్ అండ్ హ్యాండ్సమ్ హీరో దుల్కర్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తండ్రి లాగానే చాలా వేగంగా సినిమాలు చేస్తుంటాడు దుల్కర్. బట్ ను ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి. ఫస్ట్ టైమ్ ఊరమాస్ రోల్ తో వచ్చిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త మాత్రం అతనికి అన్ని భాషల్లోనూ షాక్ ఇచ్చింది. మాస్ అప్పీల్ కోరుకున్నట్టుగా కనిపించింది కానీ.. ఈ మూవీ కంటెంట్ అవుట్ డేటెడ్ అనిపించుకుంది. ఇప్పటికే మళయాలంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో డైరెక్ట్ గా మూవీస్ చేస్తూ వస్తోన్న దుల్కర్ కు ఇప్పుడు కంప్లీట్ గా తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే వరుసగా తెలుగులోనే సినిమాలు చేయబోతున్నాడు. అది కూడా ఒకటీ రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు లైనప్ లోఉన్నాయి. ఇన్ని సినిమాలు అంటే ఖచ్చితంగా అతను టాలీవుడ్ పై ఎంత ఫోకస్ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.


సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. దీంతో పాటు మరో మూడు సినిమాలున్నాయి. ఇందులో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు రూపొందించబోతున్నాడు. నిర్మాత తెలుగువాడే. మెయిన్ రిలీజ్ కూడా ఇక్కడే. మరో మూవీకి తమిళ్ వ్యక్తి నిర్మాత. ఇతను సుప్రియ యార్లగడ్డ బంధువు అని సమాచారం. లేదా సుప్రియ కూడా నిర్మాణంలో భాగస్వామి కావొచ్చు అంటున్నారు. ఇక నాలుగో ప్రాజెక్ట్ ను చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. అనేది త్వరలోనే చెబుతారట.

మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898లోనూ ఉన్నాడనే టాక్ ఉంది. సో.. ఇన్ని ప్రాజెక్ట్స్ తెలుగులోనే చేయడం అంటే ఇతర భాషల సినిమాలను కాస్త పక్కన పెట్టినట్టే కదా..? మరి ఇంత సీరియస్ గా టాలీవుడ్ పై ఫోకస్ చేయడం వెనక కారణమేంటో కానీ.. ఇప్పటికే అతను మళయాలంలో తక్కువ సినిమాలు చేస్తున్నాడని అక్కడి మేకర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా గుస్సా అవుతున్నారు. మరి ఇన్ని తెలుగు సినిమాల గురించి తెలిస్తే ఇంకెంత గుస్సా అవుతారో.

Telugu 70mm

Recent Posts

హైకోర్టుకు చేరిన ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం

జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలోని…

2 hours ago

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తో ఐశ్వర్య అనుబంధం

ఫ్రాన్స్ లోని కేన్స్ లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ ఏడాది 77వ కేన్స్…

2 hours ago

థియేటర్ల మూసివేత మా దృష్టికి రాలేదు.. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్

ఎన్నికలు, IPL కారణంగా తక్కువ ఫుట్ ఫాల్ ఉండడంతో థియేటర్లకు నష్టం జరిగింది. తద్వారా ఆదాయాలపై ప్రభావం పడింది. ఈ…

2 hours ago

‘Love Me’ Trailer.. A ghost story coming from Dil Raju’s compound

Producer Dil Raju, who has entertained with family entertainers till now, is bringing a ghost…

2 hours ago

Varun Sandesh’s ‘Ninda’ Based On True Events

Young hero Varun Sandesh's latest movie is 'Ninda'. This movie is going to be based…

2 hours ago

‘Kalki’ Audio Rights To Saregama Company

There is a huge demand for the audio rights of movies starring star heroes. There…

2 hours ago