టాలీవుడ్

ట్రాన్స్ జెండర్ గా దుల్కర్ సాల్మన్ ..?

దక్షిణాదిలో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో దుల్కర్ సాల్మన్ ఒకడు. మళయాలంలో స్టార్ హీరో హోదాలోఉన్నాడు. అదే టైమ్ లో మంచి కథలు వస్తే ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తెలుగులో మహానటి, సీతారామంతో తనదైన ముద్రను బలంగా వేశాడు. అటు ఎప్పటి నుంచో తమిళ్ లో.. రీసెంట్ గా హిందీలోనూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సైన్ చేశాడు దుల్కర్ సాల్మన్.

అందులో ఒకటి లక్కీ భాస్కర్. సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. దీంతో పాటు లేటెస్ట్ గా “కాంత” అనే మరో సినిమా కూడా అనౌన్స్ అయింది. కాంత అంటే స్త్రీ అని అర్థం. ఈ చిత్రంలోని కాంత ఎవరో కాదు.. దుల్కర్ సాల్మనే అంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు దగ్గుబాటి రానా. అతనితో పాటు స్పిరిట్ మీడియా.. దుల్కర్ సొంత బ్యానర్ వే ఫేరర్ బ్యానర్స్ కలిసి ఈ కాంతను నిర్మించబోతున్నాయి.

సెల్వమణి సెల్వరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఎదురుగా ఉన్న సాలెగూడు ముందు నించున్నాడో వ్యక్తి.”ఓ మంచి సినిమాకు సంబంధించిన పవర్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మేం చాలా అరుదైన కథను మీకు చెప్పబోతున్నాం..” అనే లైన్స్ కూడా ఈ ప్రకటనలో ఉన్నాయి. దుల్కర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమాలో దుల్కర్ సాల్మన్ ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపిస్తాడు అనే టాక్ ఉంది. అందుకే కాంత అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదల చేస్తారట. ఇప్పటికైతే అతని పాత్ర గురించి వినిపిస్తున్నది రూమరా లేక నిజమా అనేది తెలియదు. బట్ ఇలాంటి పాత్రలో దుల్కర్ నటిస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ కే కాదు ఆ జెండర్ కేఓ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని చెప్పొచ్చు.

Telugu 70mm

Recent Posts

Ketika Sharma

8 mins ago

Janhvi Kapoor

17 mins ago

NehaSolanki

21 mins ago

Varsha Bollamma

37 mins ago

Eesha Rebba

42 mins ago