ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను.. ఉస్తాద్ హీరోగా మార్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. అంతకుముందు వరుస ఫ్లాపులతో సతమతమైన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను మళ్లీ ఫామ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే. అలాంటి ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా రాబోతుంది ‘డబుల్ ఇస్మార్ట్’. మొదటి భాగానికి మించిన రీతిలో డబుల్ డోస్ మాస్ ఎలిమెంట్స్ తో ఎంటర్ టైన్ మెంట్ పంచడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ రెడీ అవుతోంది.
‘ఇస్మార్ట్ శంకర్‘ విజయంలో రామ్, పూరి జగన్నాథ్ లతో పాటు కీలక పాత్ర పోషించింది మ్యూజిక్. ఈ సినిమాకోసం మణిశర్మ అందించిన మాస్ ట్యూన్స్.. వాటికి రామ్ వేసిన స్టెప్స్ యువతను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్‘కి సైతం మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లేటెస్ట్ గా ‘డబుల్ ఇస్మార్ట్‘ పాటల పండగ మొదలవుతోంది. జూలై 1న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘స్టెప్పా మార్‘ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ చూస్తుంటేనే.. ఆ పాట ఊర మాస్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…