టాలీవుడ్

బేబీ ఎప్పుడు వస్తుందో తెలుసా..?

తెలుగులో హృదయ కాలేయం సినిమాతో దర్శకుడుగా వెరైటీ ముద్రను వేసుకున్నాడు సాయి రాజేశ్. ఆ తర్వాత కొబ్బరిమట్టి చిత్రంతో మెప్పించాడు. మధ్యలో కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ మధ్య కోవిడ్ టైమ్ లో కలర్ ఫోటో అనే సినిమాను నిర్మించాడు

.ఈ చిత్రానికి నేషనల్‌ అవార్డ్ కూడా రావడం విశేషం. ఇప్పుడు ఎస్కేఎన్ నిర్మాతగా తనే డైరెక్ట్ చేసిన సినిమా ‘బేబీ”. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్. విరాజ్ అశ్విన్ ఓ కీలక పాత్ర చేశాడు.


ఇక ఈ మూవీ ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. అవి సినిమాపై అంచనాలను పెంచాయి. కాస్త కలర్ ఫోటో టచ్ కనిపిస్తున్నా.. ఇది కూడా ఖచ్చితంగా ఓ వైవిధ్యమైన సినిమాగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు తెచ్చుకుంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇప్పటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఇదో శాడ్ ఎండింగ్ మూవీ అని కూడా అనుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంతం నుంచి పై చదువుల కోసం సిటీకి వెళ్లిన అమ్మాయి అక్కడి తళుకులు చూసి తను గతంలో ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతే ఆ ప్రేమికుడు ఏమయ్యాడు.. ఈ తళుకుల వల్ల తన జీవితంలో సంభవించిన మార్పులేంటీ అనేది ప్రధాన పాయింట్ గా ఈ చిత్రం ఉండబోతోందంటున్నారు.


ఇక ఈ సమ్మర్ లోనే వస్తుందనుకున్న బేబీ చిత్ర రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిందిమూవీ టీమ్. జూలై సెకండ్ వీక్ లో 14వ తారీఖున ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రానికి బ్యాక్ ఎండ్ లో అల్లు అరవింద్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి గ్రాండ్ రిలీజ్ ఉంటుందనుకోవచ్చు. మరి ఇన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న బేబీ ఫైనల్ గా ఏ రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

9 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

12 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

12 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

12 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

13 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

18 hours ago