మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే వారసుల గురించి ప్రస్తావిస్తే.. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఈ నందమూరి వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. ‘ఆదిత్య 369‘ సీక్వెల్ తో ఇంట్రడ్యూస్ అవుతాడని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అలాగే.. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ లలో ఒకరు మోక్షజ్ఞను పరిచయం చేస్తారనే న్యూస్ కూడా చాన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతోంది.

లేటెస్ట్ గా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. వైవిధ్యభరిత కథాంశాలతో సినిమాలు చేసే దర్శకుడిగా క్రిష్ కి పేరుంది. ఇప్పటికే బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘, ‘ఎన్టీఆర్‘ బయోపిక్ సిరీస్ వంటి సినిమాలు కూడా చేసున్నాడు. కాబట్టి.. క్రిష్ తో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన కథలను చర్చిస్తున్నాడట నటసింహం. త్వరలోనే.. మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మూవీ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

Related Posts