గేమ్ ఆన్ తో కొత్త గేమ్ వరల్డ్ లోకి వెళ్లిపోతారు : గీతానంద్

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్‌. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా హీరో గీతానంద్ మీడియాతో మాట్లాడుతూ..
“ఇదొక యూనిక్ స్టోరీ. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నించాం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. దీనిలో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ మా తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరం బాగా డిస్కస్ చేసుకునే వాళ్ళం.


నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపిస్తుంది. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఆదిత్య మీనన్ గారు, ఇందులో నటించడం సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమాతో ప్రేక్షకులు గేమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. అని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోంది.

Related Posts