టాలీవుడ్

మోక్షఙ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ఫిక్స్?

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే వారసుల్లో ఎంతో క్రేజ్ ఉన్నవాడు నందమూరి మోక్షఙ్ఞ. నటరత్న నందమూరి తారకరామారావు మూడో తరం వారసుడిగా చిత్రరంగ ప్రవేశం చేసేందుకు మోక్షు రెడీ అవుతున్నాడు. బాలయ్య తనయుడి సినీ రంగ ప్రవేశం గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అతని డెబ్యూ మూవీకోసం పలువురు టాప్ డైరెక్టర్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. లేటెస్ట్ గా ఓ యంగ్ డైరెక్టర్ ద్వారా మోక్షఙ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరగబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

‘హనుమాన్’తో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ప్రశాంత్ వర్మ.. మోక్షఙ్ఞ డెబ్యూ మూవీని డైరెక్ట్ చేయనున్నాడట. ఇప్పటికే బాలకృష్ణతో ‘అన్‌స్టాపబుల్’ వంటి షోస్ కి ప్రోమోస్ డైరెక్ట్ చేశాడు ప్రశాంత్. అలా.. బాలయ్యకి, ప్రశాంత్ వర్మకి మధ్య మంచి ర్యాపో ఉంది. ఈనేపథ్యంలోనే.. ఇటీవల ప్రశాంత్ వర్మ.. మోక్షు కోసం ఓ లైన్ వినిపించడం దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ ను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో దిట్ట ప్రశాంత్ వర్మ. మరి.. మోక్షఙ్ఞ కోసం ఈ యంగ్ డైరెక్టర్ ఎలాంటి సూపర్ హీరో స్టోరీని తీసుకురాబోతున్నాడో చూడాలి.

Telugu70mm

Recent Posts

Saanve Megghana

13 mins ago

Rashi Singh

24 mins ago

వరలక్ష్మి పెళ్లిసందడిలో బాలకృష్ణ, వెంకటేష్

వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలై సచ్‌దేవ్‌ పెళ్లి సందడి మొదలైంది. ఈ సెలబ్రేషన్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు…

2 hours ago

టాలీవుడ్ కి అసలు సిసలు కింగ్ ప్రభాస్

గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాగా పుంజుకుంది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఓ బెంచ్…

2 hours ago

ఎన్టీఆర్-జాన్వీ మాస్ డ్యూయెట్ కి సర్వం సిద్ధం

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేసే మూవీ 'దేవర'. కొరటాల శివ…

2 hours ago