రామబాణం పోతుందని ”ముందే” తెలియదా గోపీచంద్ ..?

హీరోలు తమ సినిమాలు హిట్ అయితే తమ అకౌంట్ లోకి పోతే దర్శకుల అకౌంట్ లోకి వేయడం ఏ ఇండస్ట్రీలో అయినా కనిపించేదే. మామూలుగా ఒక సినిమా ఒప్పుకోవడానికి ముందే కథమొత్తం వింటారు. ఏ కొద్దిమందో తప్ప.. ఆ కథను నెరేట్ చేసినట్టుగా తీయడానికే ప్రయత్నిస్తారు. ఈ విషయంలో పూర్తిగా దర్శకులదే తప్పుఅని చెప్పడానికి లేదు. ఎందుకంటే..డైరెక్టర్స్ రాంగ్ స్టెప్స్ వేస్తుంటే..హీరోలు ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. ఇదేమీ జమానా కాలం కాదు కదా. దర్శకులకు భయపడటానికి. పైగా ఇప్పుడు డైరెక్టర్సే హీరోలకు భయపడుతున్నారు. కథ గురించి కంటే సగం పని వారిని పాంపర్ చేయడానికే అయిపోతుంది.

ఈ విషయంలో హీరో గోపీచంద్ వాదన కొంచెం వింతగా కనిపిస్తుంది.
రీసెంట్ గా రామబాణం మూవీ రిలీజ్ కు ముందు దర్శకుడు తేజ చేసి ఇంటర్వ్యూలో కొన్ని సినిమాలు పోతాయని ‘ముందే” తెలుసు అంటూ కామెంట్ చేశాడు. అంతే కాదు.. అప్పుడు మనం ఏం చేయలేం అని కూడా చెప్పాడు. బట్ ఇది నిజం కాదు.

ఎందుకంటే కథలో లోపాలు ఉంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని సరి చేసి మళ్లీ రీ షూట్ కు వెళుతున్న రోజులు ఇవి. అలాంటిది ఓ స్టార్ హీరో అయిన గోపీచంద్ చెబితే కాదు అనే దర్శకులు, నిర్మాతలు ఉంటారా..? కానీ సినిమాలు పోయిన తర్వాత ఈ నింద సదరు దర్శకులపై ఈజీగా నెట్టేస్తున్నారు గోపీచంద్ లాంటి హీరోలు. తన గత సినిమాలన్నీ వరుసగా పోతున్నాయి.ఈ నెపం పూర్తిగా దర్శకులదే అన్నట్టు.. మధ్యలో వచ్చిన గౌతమ్ నందా మాత్రమే క్లాసిక్.. కానీ అదీ పోయింది అన్నట్టు మాట్లాడాడు.నిజానికి అతను భావించే తన ఇమేజ్ తో కంపేర్ చేసి చూస్తే గౌతమ్ నందాలో విషయం చాలా వీక్ గానే ఉంటుందని అందరికీ తెలుసు.


ఇక ఇప్పుడు వచ్చిన రామబాణం మాత్రం అద్భుతం అనేలా తెగ చెప్పుకున్నాడు ప్రమోషన్స్ లో. తీరా చూస్తే అతను చెప్పిన చాలా డిజాస్టర్స్ కంటే కూడా దారుణంగా ఉందీ కంటెంట్. ఎప్పుడో ఎనభైల కాలం నాటి కథ, కథనంతో వచ్చింది. అస్సలే మాత్రం నప్పని కలకత్తా బ్యాక్ డ్రాప్.

అన్నదమ్ముల మధ్య బాండింగ్ కనిపించదు.. ఆడియన్స్ తో ఏ ఎమోషనూ కనెక్ట్ కాదు. కామెడీ పేరుతో చేసిన వెకిలి హాస్యం, హీరోయిన్ తో లవ్ ట్రాక్… ఇలా దేనిలోనూ భూతద్దం వేసి వెదికినా కొత్తదనం కనిపించదు.

అలాంటి కథను పట్టుకుని ఆహా ఓహో అంటూ తెగ పొగిడేసిన గోపీచంద్ ఇప్పుడు ఈ సినిమా కూడా పోతుందని ముందే తెలుసు అంటూ వచ్చే సినిమా ప్రమోషన్స్ చెబుతాడా..? లేక ఇకనైనా తన చిత్రాల ఫెయిల్యూర్స్ లో అందరికంటే తన పాత్రే పెద్దది అనే నిజం తెలుసుకుని ఇకనైనా జాగ్రత్త పడతాడా..?

Related Posts