యాగాలు విజయాలు తెస్తాయా సందీప్.. ?

కెరీర్ మొదలుపెట్టి పుష్కరకాలం దాటింది. ఈ పుష్కరంలో బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి కనీసం మూడు సినిమాలు కూడా లేని హీరో సందీప్ కిషన్.

చెప్పుకోవడానికి అతను టాలెంటెడే. కానీ ఆ టాలెంట్ కథల ఎంపికలో కనిపించదు. ఎంచుకున్న కథల్లో నటించడం మాత్రమే టాలెంట్ కాదు కదా..? కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ చేయాలంటే ముందు తమ బలాలు, బలహీనతలను గుర్తించాలి. ఈ విషయంలో సందీప్ మాత్రమే కాదులే.. చాలామంది హీరోలు అలాగే ఉన్నారు. ఒకాయన సన్నగా ఉన్నా.. ఓవర్ నైట్ మాస్ హీరో అయిపోవాలనుకుంటాడు. మరొకాయన తనో నవరస నట సార్వభౌముడిని అనే భ్రమల్లో ఉంటారు తప్ప.. నిజంగా తమని తాము ప్రూవ్ చేసుకునేలా ప్రణాళికలు పెద్దగా కనిపించవు. ప్రస్తుతం హిట్ కంటే కూడా ముందు సినిమాలు చేస్తే చాలు అనే స్టేజ్ లోకి ఎప్పుడో వచ్చాడు సందీప్ కిషన్.


చివరగా వచ్చిన మైఖేల్ ను కెజీఎఫ్‌, విక్రమ్ రేంజ్ లో ఫీలయ్యి.. ఏకంగా ప్యాన్ ఇండియన్ సినిమాఅనేశారు. బట్ అది అన్ని భాషల్లో తన్నేసింది. ప్రస్తుతం ఊరు పేరు భైరవకోన అనే చిత్రంతోవస్తున్నాడు.

తన కెరీర్ లో కాస్త ఫర్వాలేదు అనే సినిమా టైగర్ ను ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. అతను ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే హారర్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క క్షణం అనే థ్రిల్లర్ తో డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. ఆ డిజాస్టర్ తర్వాత చేస్తోన్న చిత్రం ఇదే. ఊరు పేరు భైరవకోన అంటూ ఎప్పుడో ప్రకటించారు. లేటెస్ట్ గా సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. వీరి బ్యాడ్ లక్కో మరేంటో కానీ.. ఈ టీజర్ చూడగానే రీసెంట్ బ్లాక్ బస్టర్ విరూపాక్షను గుర్తుకు చేసింది. అలాగని బాలేదు అని చెప్పలేం. టైటిల్ కు తగ్గట్టుగా ఆ ఊరిలో ఏం జరిగింది అనేదే పాయింట్.


అయితే ఈ టీజర్ రిలీజ్ కు ముందు సందీప్ కిషన్ శత చండీ యాగం చేశారు. ఈ మధ్య ఇండస్ట్రీలో చాలామంది ఈ యాగం చేస్తున్నారు. అలా చేసీ చేయగానే విజయం అందుకున్నవాళ్లు ఎవరూ లేరు. బట్ సందీప్ మాత్రం ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

అఫ్‌ కోర్స్ దర్శకుడికీ కీలకమే. అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఏదేమైనా ఈ మూవీతో అయినా సందీప్ విజయం సాధిస్తే.. అదంతా కథ మహిమ అని కాకుండా యాగం గొప్పతనం చెబుతారేమో.

Related Posts