టాలీవుడ్

తమన్నాను వద్దు అనుకున్నారా..

తమన్నా ఎక్కడ.. ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ్, తెలుగు పరిశ్రమల్లో వినిపిస్తోన్న ప్రశ్న ఇదే. తమన్నా ఎక్కడికి వెళ్లిందీ అనుకుంటున్నారేమో.. ఎక్కడికీ వెళ్లలేదు. కానీ లేటెస్ట్ గా వచ్చిన జైలర్ సినిమా ట్రైలర్ లో అమ్మడి ఫేస్ కూడా కనిపించలేదు.

ఆ మధ్య ఈ చిత్రం నుంచి విడుదల చేసిన నువ్ కావాలయ్యా అనే పాట దేశవ్యాప్తంగాస సంచలనం అయింది. చిన్నా పెద్దా అంతా కలిసి తమన్నా వేసిన స్టెప్పులను రీ క్రియేట్ చేస్తున్నాడు. చాలా హాట్ హాట్ గా తను ఈ పాటలో అదరగొట్టింది. ఓ రకంగా ఈ సినిమాకు ఫస్ట్ బిగ్ అటెన్షన్ ఆ పాటతో పాటు పాటలో తమన్నా సోయగాల వల్లే వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఇక ఈ పాట చూసిన తర్వాత చాలామంది అమ్మడు చాలా పెద్ద పాత్రే చేస్తుందీ సినిమాలో అనుకున్నారు. పైగా ఒకేసారి సూపర్ స్టార్, మెగాస్టార్ సినిమాల్లో అవకాశాలు అందుకుందని కూడా అనుకున్నారు. బట్.. తీరా ట్రైలర్ చూస్తే అమ్మడికి కనీసం ఒక్క క్షణం టైమ్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు. కామన్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ మాత్రం దానికా అమ్మడు అంత హడావిడీ చేసింది.

ఆ పాటను సోషల్ మీడియాలో చూసిన ప్రతిసారీ రియాక్ట్ అయిందీ అనుకుంటున్నారు. మొత్తంగా తమన్నాకు ట్రైలర్ లో కనీసం స్థానం ఇవ్వకపోవడం మాత్రం దారుణమే అని చెప్పాలి. తనేమీ చిన్న హీరోయిన్ కాదు. ఒకప్పుడు కోలీవుడ్ లో నెంబర్ వన్ అనిపించుకుంది. సీనియర్ కూడా. మరి ఇది కావాలని చేశారా లేక నిజంగానే సినిమాలో ఆమె పాత్రకు ఏ ప్రాధాన్యతా ఉండదా అనే కొత్త చర్చలు మొదలయ్యాయిప్పుడు.

Telugu 70mm

Recent Posts

Ketika Sharma

5 mins ago

Janhvi Kapoor

14 mins ago

NehaSolanki

19 mins ago

Varsha Bollamma

34 mins ago

Eesha Rebba

39 mins ago