రష్మిక మందన్నాను తీసేశారా..?

కొన్ని కాంబినేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిదే వెంకీ కుడుముల – రష్మిక మందన్నా. ఈ ఇద్దరూ ఒకే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. రష్మిక హీరోయిన్ గా, వెంకీ కుడుముల దర్శకుడుగా. ఆ సినిమా ఛలో. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మికకు తెలుగులో ఆఫర్స్ పెరిగాయి. తర్వాత హిట్స్ పడ్డాయి. స్టార్డమ్ వచ్చింది. అందుకే ఆమెకు వెంకీ అంటే చాలా ఇష్టం.

ఇటువెంకీ కూడా తన ప్రతి సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలి అనేంతగా వీరి మధ్య బంధం పెరిగింది. వెంకీ తర్వాత సినిమా భీష్మలో కూడా రష్మికనేతీసుకున్నారు. ఈ కాంబోకి నితిన్ కూడా తోడయ్యాడు. ఆ టైమ్ లో నితిన్ వెంకీ మీద ఓ సెటైర్ కూడా వేశాడు.

“ఎవరైనా స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు సాయిరాం అనో లేదా వినాయకుడి పేరో రాస్తారు.. వెంకీ మాత్రం ముందు రష్మిక మందన్నా..” అని రాసుకుంటాడంటూ నితిన్ వేసిన సెటైర్ బలే పేలింది. ఇప్పుడు నితిన్ తోనే వెంకీ మూడో సినిమా కన్ఫార్మ్ అయింది. నితిన్ అన్నట్టుగానే ఈ చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఒక షెడ్యూల్ కూడా అయిపోయినట్టుంది. బట్ లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి రష్మిక మందన్నా తప్పుకుంది. మరి తను తప్పుకుందా లేక తీసేశారా.. ? అంటే..


ఈ సినిమా కోసం రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. ప్రస్తుతం పుష్ప2 తో పాటు రెయిన్ బోన్ అనే ఓ బై లింగ్వుల్ మూవీ చేస్తోంది. ఇవి కాక ఓ బాలీవుడ్ మూవీకి సైన్ చేసింది. వీటిలో యాక్టివ్ గా షూటింగ్ లో ఉన్న సినిమా రెయిన్ బో మాత్రమే. పుష్ప2లో రష్మిక పాత్ర పరిమితమే అంటున్నారు. ఇక బాలీవుడ్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ఎప్పుడో పూర్తయిన యానిమల్ విడుదలకు సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనంత బిజీగా ఎక్కడుందీ..? అందుకే ఆమె తప్పుకోలేదు.. వీళ్లే తీసేశారు అనేది బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలు కూడా బానే చెబుతున్నారు.


ఎలా చూసినా.. రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొంత పేరు తెచ్చుకుంది. ఆ మధ్య నేషనల్ క్రష్ కూడా అనిపించుకుంది. ఇటు వరుసగా బాలీవుడ్ ఆఫర్స్ తో పాటు ప్యాన్ ఇండియన్ సినిమాలూ పడుతున్నాయి. దీంతో ఆ యాటిట్యూడ్ సెట్స్ లో బాగా చూపిస్తోందట. భీష్మ టైమ్ లోని రష్మికకు ఇప్పటి రష్మికకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందట. ఆ తేడా డామినేటింగ్ గా ఉండటంతో పాటు ఆ డేట్స్ పేరు చెప్పి షూటింగ్ కు కూడా సరిగా అటెండ్ కావడం లేదట. దీంతో మూవీ టీమ్ వాళ్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించి.. ఆమె స్థానంలో శ్రీ లీలను తీసుకున్నారు అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బట్ శ్రీ లీల ఇప్పుడు అమెరికాలో ఉంది. సో.. శ్రీ లీల ఈ సినిమాలో నటిస్తోంది అనేది నమ్మలేం. బట్ రష్మిక వెళ్లిపోయిందనేది మాత్రం ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు. ఏంటో.. స్టార్డమ్ వస్తే ఒకలా.. రాకపోతే మరోలా..?

Related Posts