చిరంజీవి కాలికి సర్జరీ

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ జరిగింది. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు చిరంజీవి. వరుసగా సినిమాలు చేస్తూ అటు డ్యాన్స్ మూవ్స్ తో పాటు యాక్షన్స్ లు కూడా చేస్తుండటం వల్ల ఆ నొప్పి మరింత పెరిగింది. భోళా శంకర్ తర్వాత సర్జరీ చేయించుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు.

అయితే ఈ సర్జరీ అమెరికాలో చేయించుకుంటారు అనుకున్నారు. బట్ ఢిల్లోలో చేయించుకున్నారు. ఇవాళ (మంగళవారం) సర్జరీ పూర్తయింది. దీన్ని మెడికల్ టర్మ్స్ లో నీ వాష్(Knee Wash)అంటారు. ఇక వారం రోజుల పాటలు ఢిల్లీలోనే ఉండి విశ్రాంతి తీసుకుంటారు చిరంజీవి. ఈ నెల 22న ఆయన బర్త్ డే. ఆ టైమ్‌ వరకూ హైదరాబాద్ కు వస్తారని సమాచారం.


ఇక భోళా శంకర్ రిజల్ట్ అనుకున్నంతగా రాలేదు. అయినా ఆయన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. నెక్ట్స్ కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుంది. మోకాలి గాయం ఇబ్బంది పెట్టకపోతే ఈ మూవీ ఈ నెలలోనే అఫీషియల్ గా ఓపెనింగ్ జరుపుకుంటుంది. ఇక నవంబర్ నుంచి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తంగా మెగాస్టార్ సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరుకుందాం.

Related Posts