విజయ్ దేవరకొండ కొట్టినట్టేనా

విజయ్ దేవరకొండ ఒక హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు. గీత గోవిందం తర్వాత అతనికి మరో విజయం పడలేదు. వరుసగా నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలతో ఒకదాన్ని మించిన ఫ్లాప్ మరోటి చూశాడు. వీటిలో టాక్సీవాలా కొంత వరకూ ఫర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా లైగర్ తర్వాత అతనిపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి.

ఆ విమర్శలకు సమాధానం చెప్పాలంటే మాటలతో కాదు. ఒక సినిమా మొదట ఆటకు హిట్ అనే టాక్ తోనే అవుతుంది. అది ఇన్నాళ్లకు సాధ్యం అయింది. ఖుషీ మూవీతో విజయ్ దేవరకొండ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు.


ఖుషీపై ముందు నుంచీ పాజిటివ్ బజ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బిజినెస్ పరంగానూ భారీగానే అయ్యింది. ఈ మొత్తానికి సినిమా హిట్ టాక్ తో ఓ క్లారిటీ వచ్చింది. విజయ్, సమంత జంటగా నటించిన ఫస్ట్ సినిమా.. కలిసి నటించిన రెండో సినిమా ఇది. అంతకు ముందు మహానటి ఉన్నా.. అందులో వీరు మెయిన్ పెయిర్ కాదు. ఈ సారి అలా కాదు. ఈ కాంబినేషనే హైలెట్ గా వచ్చిన సినిమా ఇది. ఊహించినట్టుగానే సినిమాలో ఈ కాంబినేషన్ చాలా ఫ్రెష్ గా కనిపించింది. అద్భుతమైన నటనతోనూ మెప్పించారు. కొన్ని వీక్ సీన్స్ కూడా వీరి నటనతో పాస్ అయిపోయాయి.


ఖుషీకి అన్ని వర్గాల ప్రజల నుంచి పాజిటివ్ టాక్ వినిపస్తోంది. రెండు రాష్ట్రాలతో పాటు ఓవర్శీస్ లో కూడా అదే టాక్ వచ్చింది. దీంతో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నాడు నిర్మాతలు. పైగా చాలా రోజుల తర్వాత వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు కాబట్టి నిర్మాతలు హ్యాపీస్ అనుకోవచ్చు. మొత్తంగా ఓ మంచి మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఖుషీతో కొట్టేశాడు విజయ్ దేవరకొండ.

Related Posts