ఓ.జి టీజర్ ఎన్ని గంటలకు

మరికొన్ని గంటల్లో యూ ట్యూబ్ కు సునామీ రాబోతోంది. ఆ సునామీ పేరు పవన్ కళ్యాణ్‌. ఈ శనివారం పవన్ కళ్యాణ్‌ బర్త్ డే. ఈ సందర్భంగా సుజీత్ డైరెక్షన్ లో ఆయన నటిస్తోన్న ‘ఓజి’ మూవీ టీజర్ విడుదల చేస్తున్నారు.

ఈ టీజర్ గురించి ఇప్పటికే ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక లెక్కా.. ఓజి ఒక లెక్కా అనేంత రేంజ్ లో ఈ టీజర్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకే ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియన్స్, ఇండస్ట్రీ కూడా ఈ టీజర్ కోసం ఎదురుచూస్తోంది. మామూలుగా స్టార్ హీరోల బర్త్ డే గిఫ్ట్స్ అంటే పుట్టిన రోజు సాయంత్రానికి కానీ రాదు. ఓజి టీజర్ కూడా అలాగే అనుకున్నారు చాలామంది. బట్ వీళ్లు అలా కాదు. ఉదయం నుంచే అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపబోతున్నారు.


ఓ.జి టీజర్ శనివారం ఉదయం 10. 35 గంటలకు విడుదల చేయబోతున్నారు. అంటే మార్నింగ్ నుంచే యూ ట్యూబ్ షేక్ అవుతుందన్నమాట. ఇక ఈ టీజర్ తో సోషల్ మీడియాలో కూడా భారీ రికార్డులు సాధించాలని ఫ్యాన్స్ కూడా ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇక ఉదయం నుంచే ఫ్యాన్స్ తో పాటు జనసేన పార్టీ ఆఫీసుల్లో కూడా పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సంబరాలు మొదలు కాబోతున్నాయి. కాకపోతే వీటిని ఆస్వాదించేందుకు పవర్ స్టార్ ఇండియాలో లేడు ఇప్పుడు. చాలా కాలం తర్వాత తన బర్త్ డే ను విదేశాల్లో కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వెకేషన్ కు వెళ్లారు. అయినా అభిమానుల ప్రేమను అక్కడి నుంచే చూస్తాడన్నమాట.

Related Posts