టాలీవుడ్

జూలై 26న రాబోతున్న ధనుష్ ‘రాయన్‘

ఈతరం కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినవాడు విలక్షణ నటుడు ధనుష్. కేవలం కథానాయకుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ తన ప్రతిభ చాటుతూనే ఉంటాడు ధనుష్. ఇప్పటికే తన డైరెక్షన్ లో తొలి చిత్రం ‘పవర్ పాండి’తో భారీ విజయాన్నందుకున్నాడు. ఇప్పుడు ‘రాయన్’ సినిమాతో డైరెక్టర్ గా రెండో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్, కాళిదాస్‌ జయరామ్‌, ఎస్.జె.సూర్య, సెల్వ రాఘవన్, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే చివరిదశకు చేరుకున్న ‘రాయన్‘ జూన్ 13నే విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవ్వడంతో ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయబోతున్నారట. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఇక.. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

Telugu 70mm

Recent Posts

యు.వి. క్రియేషన్స్ లో శ్రుతి హాసన్

టాలీవుడ్ తో లాంగ్ అసోసియేషన్ ఉన్న కథానాయికల్లో స్టార్ డాటర్ శ్రుతి హాసన్ ఒకరు. ఆరంభంలో ఐరెన్ లెగ్ అనే…

6 mins ago

నెట్‌ఫ్లిక్స్ లో రాజమౌళిపై డాక్యుమెంటరీ

దర్శకధీరుడు రాజమౌళి ఓ ట్రెండ్ సెట్టర్. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్ లో నిలిపిన గ్రేట్ ఫిల్మ్ మేకర్. రాజమౌళి…

17 mins ago

‘పుష్ప 2’ క్లైమాక్స్ కోసం కసరత్తులు

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ జీనియస్ అనగానే ముందుగా గుర్తొచ్చే దర్శకుడు సుకుమార్. ఈ లెక్కల మాస్టర్ తన సినిమాల్లో…

24 mins ago

మహేష్ కి ధీటైన ప్రతినాయకుడు దొరికాడు

ప్రతినాయకుడు ఎంత పవర్‌ఫుల్ గా ఉంటే కథానాయకుడి పాత్ర అంతలా ఎలివేట్ అవుతుంది. ఈ సూత్రం దర్శకధీరుడు రాజమౌళికి బాగా…

34 mins ago

‘కల్కి 2’లో మరో ఇద్దరు అతిథులు

'కల్కి' చిత్రంలో అతిథి నటుల పరంపర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్య తారాగణం ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,…

49 mins ago

Ravi Teja Is Getting Ready To Compete With Puri

Mass maharaja Ravi Teja and dashing director Puri Jagannath have a good unbreakable relationship. Puri…

13 hours ago