రెండు వేల మంది డ్యాన్సర్స్ తో ‘దేవర’

పాన్ ఇండియా సినిమా అంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. సీన్స్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ రిచ్ గా ఉండాలి. ప్రతీ విజువల్ ని లావిష్ గా పిక్చరైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘దేవర’ విషయంలో అదే జరుగుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి విజువల్ వండర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజులో ‘దేవర‘పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్.. నెవర్ బిఫోర్ మేకోవర్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు.

గ్యాప్ లేకుండా చకా చకా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోన్న ‘దేవర’కి సంబంధించి ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. మొన్నటివరకూ సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ స్టంట్స్ చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు ఏకంగా 2000 మంది డ్యాన్సర్ తో ఓ మాసీ నంబర్ కి డ్యాన్స్ చేస్తున్నాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలబెట్టిన ‘నాటు నాటు’ పాటకు డ్యాన్సులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందట. మొత్తంమీద.. ‘దేవర’ మొదటి భాగంలో ఈ సాంగ్ ఒన్ ఆఫ్ ది హైలైట్స్ గా నిలుస్తుందంటున్నారు మేకర్స్. ‘దేవర 1’ వచ్చే యేడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts