‘దేవర’ ఫస్ట్ లుక్ అదుర్స్.. గ్లింప్స్ పై క్రేజీ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. న్యూ ఇయర్ స్పెషల్ గా ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు.. గ్లింప్స్ రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు. సెలబ్రేటింగ్ ది ఇయర్ ఆఫ్ ఫియర్ విత్ బ్యాంగ్ అంటూ జనవరి 8న ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. అంతేకాదు.. ఫుల్లీ లోడెడ్ వేవ్ లా ‘దేవర’ గ్లింప్స్ అదిరిపోతుందనే హింట్ కూడా ఇచ్చింది. ఇక.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నడి సముద్రంలో పడవపై బెబ్బులిలా కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts