‘నాటు నాటు’ ఫ్లేవర్ తో ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్

‘నాటు నాటు’ అంటూ అంతర్జాతీయంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పిన సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి. ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజిషన్ లో.. ‘నాటు నాటు’ పాటను అత్యద్భుతంగా రాసిన చంద్రబోస్.. పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ మళ్లీ ఇప్పుడు నాగార్జున ‘నా సామిరంగ’ కోసం రంగంలోకి దిగారు.

కీరవాణి సంగీతంలో చంద్రబోస్ రాయగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజయ్యింది. ‘మా జోలికొస్తే.. మాకు అడ్డు వస్తే.. మామూలుగా ఉండదు.. నా సామి రంగ’ అంటూ మాస్ లిరిక్స్ తో కింగ్ నాగార్జున మాస్ స్టెప్పులతో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా సందడి చేస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై విజయ్ బిన్నీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘నా సామిరంగ’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts